ఆ మిస్టరీ ‘ఉల్క’ కథేమిటి ?

Sharing is Caring...

సుదర్శన్ టి ………………………………    Truly cosmic wonder …………………

పై ఫొటోలో బండరాయిలా కనిపిస్తున్నది ఒక ఉల్క..  ఓ 80,000 సంవత్సరాల పూర్వం అది భూమ్మీద పడిందని అంటారు. 60,000 కిలోల బరువున్న ఈ ఉల్క  భూమిని తాకినపుడు అక్కడ పెద్ద గుంతలాంటిది ఏర్పడలేదట. అదో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే.  

హోబా అని పిలిచే ఈ ఉల్క నిజంగా ఓ అద్భుతం. ఇది భూమిపై ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద సహజమైన  ఇనుప ముక్క.  1920లో నమీబియాలో దీన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.  ఉల్కలు సాంప్రదాయకంగా మూడు విస్తృత వర్గాలుగా విభజించబడ్డాయి ..

అవి 1.  స్టోనీ మెటోరైట్లు ప్రధానంగా సిలికేట్ ఖనిజాలతో కూడిన రాళ్ళు; 2.. ఇనుప ఉల్కలు ఎక్కువగా మెటాలిక్ ఐరన్-నికెల్‌తో ఉంటాయి; 3..  రాతి-ఇనుప ఉల్కలు పెద్ద మొత్తంలో   లోహం  రాతి పదార్థాలను కలిగి ఉంటాయి.  ఈ హోబా  ఉల్కలో  ఇనుము ఎక్కువగా ఉందని కనుగొన్నారు.  

ఇక  ఈ ఉల్కలు ఎలా భూమి మీద పడతాయంటే …. సౌరమండలంలోకి  మొన్న మనం ఉపగ్రహం పంపామే అంగారక గ్రహం, దానికి బృహస్పతి కి మధ్య అస్ట్రాయిడ్ బెల్ట్ అని ఒకటుంది. ఇక్కడ కొన్ని లక్షల బండరాళ్ళ లాంటివి సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ఇవి మన గ్రహాలంత పెద్దవి కాకున్నా బాగా పెద్దవి.

ఈ గురుగ్రహం, జూపిటర్ సౌరమండలం లోనే అతిపెద్ద గ్రహం కదా కాబట్టి దాని “గురు”త్వాకర్షణ శక్తి కూడా మామూలుగా ఉండదు. ఆ శక్తి వల్ల ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో తిరుగుతున్న రాళ్ళు అప్పుడప్పుడూ బృహస్పతి వైపు లాగ బడతాయి. అలా అవి బృహస్పతి వైపు వెళుతూ మద్యలో భూమి తారసపడితే భూమ్మీద పడిపోయే అవకాశం ఉంది. ఇలా భూమ్మీదకు దూసుకొచ్చిన ఆస్ట్రాయిడ్ ను meteoroid అంటారు. భూమ్మీదకు రాకుంటే దాని పేరు ఆస్ట్రాయిడే మరి.

అవి మన భూమ్మీదకు దాదాపు 72,000 కిమీల వేగంతో దూసుకొస్తాయి. అలా దూసుకొచ్చినపుడు మన వాతావరణంలో ప్రవేశించగానే విపరీతమైన వత్తిడి వల్ల ఆ meteoroid ఉపరితలం కాలిపోతుంది. అదే చిన్నచిన్నవైతే పూర్తిగా కాలిపోతాయి. వాటిని మనం meteor అంటాము. కానీ పెద్ద పెద్ద మెటెరాయిడ్స్ కొంచెం కాలిపోయి మిగిలిన భాగం భూమ్మీద పడుతుంది అలా పడ్డ meteoroid ను meteorite అంటాము.

ఈ 60 టన్నుల meteorite పేరు Hoba Meteorite.ఇప్పుడది   సౌత్ ఆఫ్రికా లోని నమీబియా అనే దేశంలో ఉంది. అక్కడికి వెళితే వెళ్లి దాని చుట్టూ తిరగొచ్చు.దాన్ని తాకవచ్చు ..ఆ అనుభూతిని ఎంజాయ్ చేయవచ్చు.  ఫోటోలు దిగొచ్చు. నమీబియా ప్రభుత్వం దాన్ని జాతీయ స్మారకంగా మార్చింది. 
అనేక సంవత్సరాల అధ్యయనం తర్వాత కూడా హోబా ఉల్క మిస్టరీ పూర్తిగా వీడలేదు. అది ఎపుడు ? ఎలా ? ఎందుకు ? భూమి పై పడిందో ఖచ్చితంగా తేలలేదు. పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి.    

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!