సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 1
***
” సనాతనధర్మం “… ఇదే అనంత విశ్వానికి మూలాధారం.
మతాన్ని, దేవుడిని రక్షిస్తున్నామంటూ ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా… మత విశ్వాసులను ఇంకాస్త అంధకారంలోకి నెట్టేస్తూ, పురాణేతిహాసాలను bedtime stories ( నిద్రవేళ కథలు) స్థాయికి దిగజార్చిన ఆ కొందరికి నా ఈ పోస్టు అంకితం. వేద, పురాణ వాజ్ఞ్మయాలను వాటిలో చెప్పబడినట్లుగానే హేతువాద దృక్కోణంలో అర్థం చేసుకోగలరని నా మనవి.
పరమాత్మ… సృష్టి, స్థితి, లయలకు త్రిమూర్తులను నియోగించిన పిదప చతుర్ముఖ బ్రహ్మ సృష్టికార్యానికి పూనుకోగా మధు-కైటభులనే రాక్షసులు వేదాలను అపహరిస్తే విష్ణువు వారిని సంహరించి వేద పరిరక్షణ చేస్తాడు. ఇది మనకందరికి తెలిసిందే. అయితే…
ప్రశ్న : సృష్టికార్యమే మొదలుకాక ముందు రాక్షసులు ఉనికి ఏమిటి ? ఇదెలా సాధ్యం ?
వివరణ : చర్యకు ప్రతిచర్య ఎంత సహజమో, శక్తికి ప్రతిగా ప్రతిశక్తి (positive + / negative – ) ఉండటం కూడా అంతే సహజం. త్రిమూర్తుల ఆవిర్భావం వెంబడే ముగ్గురు రాక్షసుల ( మధువు, కైటభుడు, హయగ్రీవుడు ) ఉత్పత్తి కూడా జరిగింది reflection (ప్రతిబింబం) లాగా. మధు-కైటభ వృత్తాంతం భాగవత పురాణం లోనిది.
హయగ్రీవుడు గుర్రం తల గల రాక్షసుడు. వీడు కొద్దిపాటి జ్ఞానం కలవాడు. మంచి – చెడుల ఘర్షణలో మధు-కైటభులు వేదాలను అపహరిస్తే విష్ణువు ఐదువేల వర్షాలు యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో హయగ్రీవుడు తెలివిగా బ్రహ్మని తపస్సుతో మెప్పించి చావులేని వరం ఇమ్మంటాడు. అది సాధ్యం కాదు, నేను కూడా చావుకి అతీతుడిని కాదు ( ఈ విషయం మరో పోస్టులో వివరించగలను ), మరేదైనా కోరుకోమంటాడు బ్రహ్మ. అయితే నా పేరుతో ఉన్నవాడు, నాలాంటి రూపం గలవాడు మాత్రమే నన్ను చంపగలిగేట్లు వరం ఇమ్మంటాడు హయగ్రీవుడు.
మధు-కైటభులతో యుద్ధం తరువాత తీవ్ర అలసటతో తన ధనస్సుపై తలానించి నిల్చొనే గాఢనిద్రలోకి జారుకుంటాడు విష్ణువు. మధు-కైటభులు దాచిన వేదాలను దొరకబుచ్చుకున్న హయగ్రీవుడు బ్రహ్మకి తలకు మించిన భారమయ్యాడు. విష్ణువు సాయం కోసం వచ్చిన బ్రహ్మ, రణభూమిలో నిల్చొని నిద్రపోతున్న విష్ణుమూర్తిని మేల్కొలపలేక, ప్రత్యక్షంగా అతన్ని తాకే ధైర్యం లేక, నిద్రాభంగం చేయదలిచిన బ్రహ్మ వింటినారిని తెంపాడు.
ఈ హఠాత్పరిణామంతో వింటినారి చేత విపరీతమైన ఒత్తిడి వల్ల వంచబడిన ధనుస్సు మరుక్షణంలో పెద్ద శబ్దంతో ఒత్తిడి నుంచి విముక్తం అవడంతో విష్ణువు తల తెగి దూరంగా విసిరివేయబడ్డది. హతాశుడైన బ్రహ్మ , పరమాత్మ (శక్తి) ని వేడుకోగా… గుర్రం తలతో విష్ణువుకి ప్రాణదానం చేసి హయగ్రీవుడని నామకరణం చేసిన పిదప విష్ణువు హయగ్రీవ రూపంలో రాక్షసుడైన హయగ్రీవుని సంహారం చేస్తాడు. (మూలం: దేవీభాగవతం. జ్ఞానప్రకాశకుడైన విష్ణు అంశ హయగ్రీవుని జయంతి అక్షరాభ్యాసానికి అత్యుత్తమమైనది.)
Astronomy says….. At the beginning of the UNIVERSE after BIGBANG there was exact replica of matter called antimatter. They fought each other for dominance. We are fortunate that matter has won. ( ఖగోళశాస్త్రం ఏం చెబుతోందంటే… విశ్వ జననానికి కారణమైన భయంకర విస్ఫోటనం తరువాత పదార్థానికి వ్యతిరేకంగా అదే సారూప్యతతో ప్రతి పదార్థం కూడా ఏర్పడింది. ఆ రెండింటి మధ్య జరిగిన ఘర్షణలో మన అదృష్టం కొద్దీ పదార్థం విజయం సాధించింది.)
త్రిమూర్తితత్వంకి సమర్ధింపుగా… UNIVERSE was made up with 1. Matter , 2. Dark Matter, 3. Dark Energy. (ఈ విశ్వం అంతా పదార్థం, కృష్ణ పదార్థం, కృష్ణ శక్తి అనే మూడింటితో ఏర్పడింది. కృష్ణ అంటే నలుపు, నిగూఢం అని అర్థం.)
హేతువాదం, శాస్త్రీయతల ఆధారంగా పురాణేతిహాసాలను పిల్లలకు నేర్పుదాం. రంధ్రాన్వేషణ మాని సారూప్యతపై దృష్టి నిలప మనవి.
చెణుకు : జ్యోతిషశాస్త్రానికి మూలాధారం ఖగోళశాస్త్రం. ప్రఖ్యాత జ్యోతిష్యశాస్త్రం అయిన “బృహత్ పరాశర హోర శాస్త్రం” రాసిన పరాశర మహర్షి తన ఆశ్రమం వెలుపల రాతి బండపై వేసిన దర్భ చాప మీద పడుకొని అనంత విశ్వం వైపు చూస్తూ ఈ శాస్త్రాన్ని చెప్పగా ఆయన శిష్యుడు రాశాడని ప్రతీతి. ఒకనాడు గురువు గారి మీద ప్రేమతో ఆ ఒక్క దర్భ చాప సౌకర్యంగా లేదేమోనని భావించి శిష్యుడు మరో దర్భచాపను దాని మీద పరిచాడు.
యథావిధిగా పరాశర మహర్షి వచ్చి ఆ చాపపై పడుకొని ఆకాశం వైపు చూస్తూ విప్పారిన నేత్రాలతో శిష్యుని ముందు తన సంభ్రమాశ్చర్యాలను ఇలా వెలిబుచ్చాడు… “శిష్యా! ఏమిటీ పరమాద్భుతం? నాకెందుకీవేళ నక్షత్రాలు, గ్రహాలు ఎంతో దగ్గరగా ఎందుకు గోచరిస్తున్నాయి?.”
——- పులి ఓబుల్ రెడ్డి