మంత్రి గారూ ఏమిటి ఆ ప్రకటన ?

Sharing is Caring...

Govardhan Gande …………………………………………..

బాధ్యత గల మంత్రులు కూడా ఒక్కోసారి కామెడీ చేస్తుంటారు. నిన్న ఒక తెలంగాణ మంత్రి రేప్ కేసులో నిందితుడిని పట్టుకుంటాం ..ఎన్కౌంటర్ చేస్తామని రెండు మూడు సార్లు మీడియాతో అన్నారు. అదో పెద్ద వార్తయింది. జనాలు అది చూసి నవ్వుకుంటున్నారు.నిందితుడిని ఎన్కౌంటర్ చేయడం తప్పని .. అయినా ముందు చెప్పి ఎవరూ చేయరని మంత్రి గారికి తెలియక పోయి ఉండొచ్చు. అయినా ఓపెన్ గా ఎన్కౌంటర్ చేస్తామని ప్రకటించడం తప్పు.

ఆయనే అన్నీ చేస్తే ఇక కోర్టులు .. చట్టాలు .. పోలీసులు ఎందుకు ? అయినా హింస కు ప్రతిహింస జవాబు కాదు. అనాగరిక (హత్య,అత్యాచారం లాంటి) ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు సమాజం తీవ్రంగానే స్పందిస్తుంది. హత్య చేసినవాడిని, అత్యాచారం చేసిన వాడిని చంపేయాలని ఆగ్రహిస్తుంది. ఆ దుర్ఘటన తీవ్రత వారిని అలా స్పందింపజేస్తుంది. ఆ స్పందనను తప్పుబట్టలేం.

బాధ్యత గల వ్యక్తులు అలా స్పందించకూడదు. బాధితులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగని ఆ దోషిని శిక్షించకుంటే సామాజిక అశాంతికి దారితీస్తుంది. ఆ దుస్థితి తలెత్తకుండా చూసేందుకే కదా ఆధునిక,ప్రజాస్వామిక, నాగరిక వ్యవస్థలను రూపుదిద్దుకున్నది.అలాంటి నేరాలు,ఘోరాలు జరగకుండా చూడడమే కదా ఈ వ్యవస్థల పని. వ్యవస్థ తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించనపుడే కదా ఇలాంటి హత్యలు,అత్యాచారాలు,ఘోరాలు,దుర్మార్గాలు సంభవించేది.

అంటే వ్యవస్థ విఫలమైందని అర్ధం కదా.దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ దోషులను ఎన్కౌంటర్ పేరిట చంపేసి సమాజం వ్యక్తం చేసిన ఆగ్రహావేశాలు తాత్కాలికంగా చల్లారుస్తుంది.ఇలాంటిదే మళ్లీ సంభవించినప్పుడు మళ్లీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇదే నా ఆధునికత? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదే సరైందయితే ఈ రాజ్యాంగం,చట్టాలు ఎందుకు?కంటి కి కన్ను, పంటి కి పన్ను అనే  ఆదిమ, మధ్యయుగాల శైలికి ఇప్పుడు ఆధునిక,నాగరిక సమాజానికి తేడా ఏమిటి?

వెనకటి శైలి నే అనుసరిస్తే వేల కోట్ల జనం సొమ్ముతో నిర్వహించే ఈ ఎన్నికలు ఎందుకు? నేరాన్ని విచారించి శిక్షించవలసిన న్యాయ వ్యవస్థ ఎందుకు? ఈ వాదన నిందితులు,దోషుల కు అనుకూల వాదనగా కనిపించవచ్చు. జరిగిన (సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసికందు హత్యాచారం) దుర్మార్గం అలా ఆలోచింప జేసే అవకాశం ఉన్నది.కానీ అది నిజం కాదు. సందర్భం అదే కానీ దోషులు,నేరాలను వెనకేసుకు రావడం ఎంత మాత్రం కాదు.

నేరాల నివారణ,నిర్మూలన కోసం ఎంతో ప్రజాధనంతో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థతో రాజ్యం సరిగ్గా పని చేయించడం లేదని భావించవలసి వస్తున్నది.నేరాలకు పాల్పడిన వారిని ఆయుధం తో నిర్మూలిస్తామనే ధోరణి ఏ మేరకు ప్రజాస్వామికం అనే ప్రశ్న తలెత్తుతున్నది. అతి పెద్ద విచారణ, న్యాయ వ్యవస్థ ఉనికికి అర్ధం ఏమిటి? వాటిని నామ మాత్రంగా, బలహీనంగా మార్చిన ఫలితమే కదా ఈ నేరాలు, సామాజిక అశాంతి.పోలీసులు త్వరితగతిన నిందితుడిని పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలి.

pl watch vedeo ……………….  ఎన్కౌంటర్ చేస్తాం 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!