పసలేని కథ … పవర్ఫుల్ టైటిల్!

Sharing is Caring...

An old formula story…………………………………..

‘ది వారియర్’ టైటిల్ మాత్రమే బాగుంది కానీ సినిమా కథ .. కథనం లో కించిత్తు  కొత్త దనం లేదు. ఇలాంటి కథాంశంతో గతంలో  బోల్డు సినిమాలు వచ్చాయి.  హీరోలు.. విలన్లు మారారు కానీ సబ్జెక్టు మారలేదు. తమిళ మాస్ మసాలా డైరెక్టర్ లింగు స్వామి టేకింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేదు. సినిమా రిచ్ గా తీశారు కానీ కథ పై సరైన కసరత్తు చేయలేదు.

డాక్టర్ ను పోలీస్ ఆఫీసర్ గా మార్చడం అనే ఒక్క పాయింట్ తప్ప మరే కొత్త పాయింట్ లేదు. డాక్టర్గా ఉన్నప్పుడు కూడా హీరో అగ్రెసివ్ గానే ఉంటాడు. పోలీస్ అయినపుడు అదే అగ్రెసివ్నెస్ … తేడా ఏమి లేదు. హోదా ఒక్కటే మారుతుంది. సినిమాలో లాజిక్ కి అందని సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి.

అరిగిపోయిన పాత ఫార్ములా కథ ని ఎంచుకున్న దర్శకుడు తెలుగు ప్రేక్షకులను తక్కువ అంచనా వేసాడు. ఏం జరగబోతున్నదో ప్రేక్షకుడు ఊహించే విధంగా కథ సాగుతుంది. హీరో విలన్ ల మధ్య  సన్నివేశాలు బలహీనంగా ఉన్నాయి. హీరో .. విలన్ మధ్య పెట్టిన ఫైట్స్  బాగున్నాయి.  కథలో బలం లేకపోవడంతో..  యాక్షన్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేసాడు లింగు స్వామి.

హీరో ..హీరోయిన్ ల మధ్య పెట్టిన లవ్ ట్రాక్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. కథనం రొటీన్ గా ఉండటం మూలాన సినిమా బోర్ కొడుతుంది. సినిమాలో అద్భుతమైన డైలాగులు కూడా లేవు. బలమైన సన్నివేశాలు లేకుంటే డైలాగు రైటర్ కూడా ఏమీ చేయలేరు. 

డాక్టర్ గా పోలీస్ ఆఫీసర్ గా పోతినేని రామ్ మెప్పించారు. విలన్ గురు గా ఆది పినిశెట్టి కొత్త గా కనిపించాడు. ముందు ముందు ఆది కి మరిన్ని విలన్ పాత్రలు  రావచ్చు.  సినిమాలో విజిల్ మహాలక్ష్మి గా కృతి శెట్టి  పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కథలో ఆమె పాత్ర కీలకం కాదు.  ఉన్నంతలో ఆమె బాగానే చేసింది.

రామ్ తల్లిగా నదియా పాత్ర పరిధిలో బాగానే నటించింది. బ్రహ్మాజీ పాత్ర కూడా అంతే. ఇక సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న బీజీఎం, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి. విడుదలైన నెలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సినిమా ఇది. హాట్ స్టార్ లో  స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్న వారు చూడవచ్చు.  
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!