VMRG on the path to success… now only in digital form …………………………..
మంచి ప్రయోజనాలకూ, మంచి ప్రయోగాలకూ మార్కెట్లో ఎప్పుడూ గుర్తింపు లభిస్తూనేవుంటుంది. ఆ కోవలోదే విఎమ్ఆర్‌జి ఇంటర్నేషనల్. తెలుగు ప్రచురణ రంగంలో కొత్త అంశాలపై అనేక ప్రయోగాలు చేసి, ఘన విజయాలు సాధించిన సంస్థగా విఎమ్ఆర్‌జికి మంచి గుర్తింపుంది.
విభిన్నఅంశాలపై తెలుగులో తొలిసారిగా పుస్తకాలను విడుదల చేసిన ఘనతను విఎమ్ఆర్‌జి సొంతం చేసుకుంది. గత 30 ఏళ్ల ప్రచురణ ప్రయాణంలో సుమారు ఐదు కోట్ల మందికి ప్రయోజనాలను అందించింది. ఈ పబ్లిషింగ్ సంస్థను సీనియర్ జర్నలిస్టు, సీనియర్ టెక్నికల్ రైటర్ సురేశ్ వెలుగూరి ప్రమోట్ చేశారు..
వర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్, స్టార్టప్స్, కస్టమర్ కేర్, పదవ తరగతి తరువాత, కొత్తతరం కెరియర్లు, సోషల్ మీడియా స్టార్టప్స్, కొత్తతరం మానసిక వికాసానికి ఉపయోగపడే పలు తరహాల అంశాలపై విఎమ్ఆర్‌జి విడుదల చేసిన పుస్తకాలన్నీ తెలుగు పాఠకులకు బాగా చేరువయ్యాయి. ఈ తరహా పుస్తకాలు తెలుగులో రావడం ఎప్పటికప్పుడు తెలుగు పాఠకులకు ఆశ్చర్యమే కలిగించింది. కొత్తతరం యువతీ యువకులతో పాటు అందరికీ ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడ్డాయి.
పదవ తరగతి తరువాత? పేరుతో 1999 నుంచి ఇప్పటిదాకా ఒక పుస్తకాన్ని విఎమ్ఆర్‌జి ప్రతి ఏటా విడుదలచేస్తూ వచ్చింది.
తల్లిదండ్రులతో పాటు అనేకమంది టీచర్లు, ఎన్‌జీవో సంస్థలు కూడా ఈ పుస్తకం తాజా ఎడిషన్ కోసం ఎదురుచూస్తారు. గత పదిహేనేళ్లలో ఇదే తరహా పుస్తకాలు కొందరు రచయితలు విడుదల చేసినప్పటికీ విఎమ్ఆర్‌జి స్టాండర్డ్స్ ముందు అవేవీ నిలబడలేకపోయాయి. పదవ తరగతి తరువాత కెరియర్ అంశాలపై విఎమ్ఆర్‌జి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత పాతికేళ్లలో వెయ్యికి పైగా కెరియర్ గైడెన్స్ సెషన్లను నిర్వహించింది. దాదాపుగా అన్ని మేజర్ పట్టణాలు, నగరాల్లో అవగాహన సదస్సులను నిర్వహించింది.
కొత్తగా ఉద్యోగం సాధించినవారు, ఇప్పటికే ఉద్యోగాల్లో వున్నవారు తమ కెరియర్లలో ఎలా వ్యవహరించాలి, మంచి అవకాశాల్ని దక్కించుకోవటానికి ఎలా అడుగులు వేయాలి వంటి అనేక అంశాలపై విలువైన, సమగ్రమైన సమాచారాన్ని పొందుపరుస్తూ విఎమ్ఆర్‌జి విడుదల చేసిన వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం 50 వేల కాపీలకు పైగా అమ్ముడుపోయింది.
ఉద్యోగావకాశాలు కాకుండా, సొంత వ్యాపారాలను ప్రారంభించే ఆసక్తి వున్నవారి కోసం విఎమ్ఆర్‌జి స్టార్టప్ వన్ పేరుతో ఒక పుస్తకాన్ని 2015లో విడుదల చేసింది. సొంత వ్యాపారాల్ని ఎలా ప్రారంభించుకోవాలి, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, కాలనుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా ఎలా నడవాలి, స్టార్టప్‌లకు అనుమతులు, పెట్టుబడులు, ఇతర ఖర్చులు తదితర అంశాలపై సమగ్రమైన సమాచారాన్ని అందించింది.
ఏటా తాజా సమాచారంతో ఈ పుస్తకాన్ని అప్‌డేట్ చేస్తూ 2025లో పదవ ఎడిషన్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కూడా ఈ పుస్తకం విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పుస్తకం ఆధారంగా సొంత వ్యాపారాలు పెట్టుకున్నవారు వందల సంఖ్యలో వున్నారు. స్టార్టప్ అంశాలపై విఎమ్ఆర్‌జి 60కి పైగా అవగాహన సెషన్లను నిర్వహించింది.
కస్టమర్ కేర్ రంగంలో వున్న లక్షలాది అవకాశాలను వివరిస్తూ 2016లో విఎమ్ఆర్‌జి ఒక సమగ్ర సమాచార పుస్తకాన్నివిడుదల చేసింది. తెలుగులో ఈ అంశమ్మీద ఇదే తొలి పుస్తకం. అద్భుతమైన ఆదరణను పొందింది.అలాగే వ్యక్తిత్వ వికాసంలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ విఎమ్ఆర్‌జి ప్రచురించిన ఇంగ్లీష్ పుస్తకం Sky is the Limit తొలి ఎడిషన్ కేవలం మూడు నెలల్లోనే 1500 కాపీలు అమ్ముడుపోయింది.
నోవర్టిన్ అనే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ పదేళ్ల కాలానికి ఈ పుస్తకం హక్కుల్ని కొని, ఐదు లక్షలకు పైగా ప్రతుల్ని అమ్మింది. దేశవ్యాప్తంగా 3000కి పైగా కంపెనీలకు ఈ పుస్తకం చేరింది. 2015లో దీని తెలుగు ఎడిషన్ ‘ఆకాశం నీ హద్దురా’ !! విడుదలై మంచి విజయాన్నిసాధించింది.
ఇలా ప్రచురించిన అన్ని పుస్తకాలకూ ఘనవిజయాల్ని సాధించిన సంస్థగా విఎమ్ఆర్‌జి పబ్లిషింగ్ రంగంలో మంచి స్థానాన్ని సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 54 పుస్తకాలు విడుదల చేయగా, వీటిలో 44 పుస్తకాలు తెలుగువే. వీటిలో కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కూడా విడుదలయ్యాయి. వీటిలో ఎక్కువభాగం పుస్తకాలు విఎమ్ఆర్‌జి సీఈఓ, సీనియర్ జర్నలిస్టు, సీనియర్ టెక్నికల్ రైటర్ సురేశ్ వెలుగూరి రచించినవే.
ఇప్పటిదాకా ప్రింట్ రూపంలో పుస్తకాలను విడుదల చేసిన విఎమ్ఆర్‌జి … మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తాజా కంటెంట్‌ను అందించేందుకు కొత్త పంథాలను ఎంచుకుంటోంది. ఇకనుంచీ పాడ్‌కాస్ట్ ఆడియోలు, షార్ట్ వీడియోల రూపంలో మాత్రమే కంటెంట్‌ను అందించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే 2025 జూన్ వరకు ప్రింట్ అయిన పుస్తకాలు, ప్రింట్ ధరకే (అన్ని పుస్తకాలూ తాజాగా అప్డేట్ అయినవే.) అందించాలని నిర్ణయించింది.
అందుబాటులో ఉన్న పుస్తకాలు… పోస్టల్ చార్జీలు కలిపే వున్నాయి.. స్టాక్ చాలా తక్కువగా ఉంది, త్వరపడండి.
వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి – ₹200
Win @ Workplace – ₹200
స్టార్టప్ వన్ – ₹250
Startup One (English) – ₹200
ఆకాశం నీ హద్దురా!! – ₹100
English Grammar for Journalists – ₹200 (Evergreen book)
పదవ తరగతి తరువాత? – ₹200
కృత్రిమ మేధ – ₹200
నల్లమల వాలిమామ ప్రపంచం – ₹2000 (Evergreen book – Nature & Our Future Theme)
పహాడీ మందిర్ (డిటెక్టివ్ నవల) – ₹110
ఒకటి కంటే ఎక్కువ కాపీలు కావాలంటే… పుస్తకం ధరతో పాటు షిప్పింగ్ ధర ₹30 కలపండి.
UPI Phone number : 9849970455
ఆర్డర్‌కి లేదా వివరాలకు కాల్ చేయండి: 9849970455
స్టాక్ క్లియర్ అయేలోపు బుక్ చేసుకోండి!
ఈ అవకాశం మరోసారి రాదు!
…

