యుద్ధనీతిని అటకెక్కించిన అగ్రరాజ్యాలు !!

Sharing is Caring...

Violation of the war rules ………..

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న, జరిగిన యుద్ధాలను గమనిస్తే (ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా ఇరాన్ -ఇజ్రాయెల్ -అమెరికా) అంతర్జాతీయ సమాజం నిర్దేశించిన యుద్ధ నీతి (Rules of War/International Humanitarian Law) ని అందరూ ఉల్లంఘిస్తున్నారని  స్పష్టమవుతోంది.

యుద్ధంలో కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకోవాలి. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలపై దాడులు చేయకూడదు.కానీ నియమాలను ఎవరూ పాటించడం లేదు. గాజాలో ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు, ఉక్రెయిన్‌లోని నివాస సముదాయాలపై దాడులు జరిగాయి. ఇక ఇరాన్ లోని  మినాబ్ (Minab) పాఠశాల ఘటన కూడా యుద్ధ నీతికి పాతర వేసిన సందర్భమే.

బందీలను హింసించకూడదు, రసాయన ఆయుధాలు వాడకూడదు. సామూహిక హత్యాకాండకు పాల్పడకూడదు. కానీ బందీల పట్ల అమానవీయ ప్రవర్తన, క్లస్టర్ బాంబుల వాడకం వంటి ఆరోపణలు వచ్చాయి  .. వస్తున్నాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఇప్పటికే కొన్ని దేశాల నేతలపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం దీనికి నిదర్శనం.

యుద్ధ బాధితులకు ఆహారం, మందులు అందేలా చూడాలి. ‘మానవతా కారిడార్ల’ను అనుమతించాలి. గాజా వంటి ప్రాంతాల్లో ఆహారం, నీటి సరఫరాను నిలిపివేయడం “ఆకలిని ఒక ఆయుధంగా” (Starvation as a weapon of war) వాడుతున్నట్లు అంతర్జాతీయ సంస్థలు విమర్శిస్తున్నాయి.

ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) ఆధారిత దాడులు పెరిగాయి. వీటివల్ల లక్ష్యం తప్పి అమాయక పౌరులు బలవుతున్నారు. బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదు మినాబ్ ఘటనలో అమెరికా-ఇరాన్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.  

నేటి యుద్ధాల్లో “నీతి” కంటే “గెలుపు”, “ప్రతీకారం” అనే అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. శక్తివంతమైన దేశాలు తమ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తున్నాయి. ఫలితంగా పసిపిల్లలు, వృద్ధులు, అమాయక ప్రజలు బలైపోతున్నారు.

ఉక్రెయిన్, గాజా,ఇరాన్లో జరిగిన,జరుగుతున్నయుద్ధాల్లో చిన్నారుల మరణాలకు సంబంధించి సంఖ్య చాలా ఎక్కువ గానే ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవ మరణాలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.  

ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సంఘాల నివేదికల ప్రకారం  అక్టోబర్ 2023 నుండి ఇప్పటివరకు సుమారు 20,000 కంటే ఎక్కువ మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.మార్చి 2026 మొదటి వారంలోనే ఇజ్రాయెల్ దాడుల వల్ల కనీసం 322 మంది చిన్నారులు చనిపోయినట్లు UNICEF ధృవీకరించింది.కేవలం బాంబు దాడులే కాకుండా, ఆహారం లేక (మాల్‌న్యూట్రిషన్)  చలి కారణంగా కూడా అనేకమంది శిశువులు మరణిస్తున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో చిన్నారుల మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
ఫిబ్రవరి 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు కనీసం 745 మంది చిన్నారులు మరణించినట్లు,  2,375 మంది గాయపడినట్లు UNICEF జనవరి 2026 నాటి నివేదికలో వివరించింది. 

మార్చి 7, 2026న ఖార్కివ్‌లోని ఒక నివాస భవనంపై జరిగిన రష్యా క్షిపణి దాడిలో మరో ఇద్దరు చిన్నారులు మరణించారు.2024తో పోలిస్తే 2025లో చిన్నారుల మరణాల రేటు 11% పెరిగింది. యుద్ధ నీతి ప్రకారం చిన్నారులను, పాఠశాలలను లక్ష్యంగా చేసుకోకూడదు, కానీ యుద్ధాల్లో అంతర్జాతీయ మానవీయ చట్టాలు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!