రిస్క్ తగ్గించుకోండి !

Sharing is Caring...

స్టాక్ మార్కెట్ లో ఇదివరలో లాగా దీర్ఘకాలిక వ్యూహాలను ఎవరు అనుసరించడం లేదు. స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తూ తెలివిగా అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తూ లాభాలను గడిస్తున్నారు కంపెనీ పని తీరు బాగున్నప్పటికీ షేర్ ధర పెరగక పోతే లాభాలు రావు.ఆలాంటి షేర్లు వుంటే ఒక్కో సారి నష్టాలకు అవకాశం వుంటుంది. అలాంటపుడు కొంత నష్టానికైనా ఆ షేర్లను వదిలించుకోవాలి అందుకే పోర్ట్ ఫోలియోలో మార్పులు చేస్తుండాలి. 

పోర్ట్ ఫోలియో అంటే పలు రకాలైన షేర్లను కలిగి ఉండటమే.పెట్టుబడి మొత్తాన్ని వివిధ రంగాలకు చెందిన షేర్లలో మదుపు చేయడమే.ఆయా షేర్ల ద్వారా వచ్చే లాభ నష్టాలను బ్యాలన్సు చేసు కోవడాన్నే పోర్ట్ ఫోలియో నిర్వహణ అంటారు. కాగా షేర్లలో రిస్క్ తగ్గించుకోవడానికి మార్గం పోర్ట్ ఫోలియో ను సక్రమం గా నిర్వహించుకోవడమే. పోర్ట్ ఫోలియో లో 5– 10షేర్లు వుండాలి. 10 కన్నా ఎక్కువ షేర్లు మంచిది కాదని నిపుణుల అభిప్రాయం .ప్రపంచం లోనే స్టాక్ మార్కెట్ ద్వారా అపర సంపద గడించాడని పేరున్న వారెన్ బఫెట్ కూడా 10 షేర్ల పోర్ట్ ఫోలియో నే నిర్వహిస్తారని ప్రతీతి. 

స్టాక్ మార్కెట్ ద్వారా  లాభాలు ఆర్జించ గోరే వారు ఇలాంటి పోర్ట్ ఫోలియో ను నిర్వహించడమే మేలు. అవసర మైన సందర్భాలలో ఈ పోర్ట్ ఫోలియో ను మారుస్తుండాలి. లేకపోతే రిస్క్ పెరిగి పోతుంది.మన పోర్ట్ ఫోలియో లో అన్ని ఫండ మెంటల్స్ బలం గా ఉన్న షేర్లు  వున్నాయని భావించకూడదు ఒక్కోసారి మంచి షేర్లు కూడా పెరగవు పెరగక పోగా తగ్గుతుంటాయి.అలా తగ్గి మరల అంతా త్వరగా పెరగవు.

వాటిని ముందుగా గుర్తించాలి. అవసరమనుకుంటే వాటిని తప్పించాలి.వాటి స్థానే వేరే షేర్లను కొనుగోలు చేయాలి. పోర్ట్ ఫోలియో ను పదే పదే మార్చడం కూడా మంచిది కాదు.అయితే షేర్ల ధరలను మాత్రం తరచుగా సమీక్షిస్తుండాలి . అప్పుడే మనకు లాభాలు వస్తున్నాయా?నష్టాలు వస్తున్నాయా అనేది తెలుస్తుంది. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో వున్నపుడు మంచి షేర్లు కనిష్ట ధరల వద్ద లభిస్తుంటాయి. కాబట్టి ఆలాంటి సమయం లో పోర్ట్ ఫోలియో లో మంచి షేర్లను పెట్టుకోవాలి .
పోర్ట్ ఫోలియో లో ఎపుడు ఒకే పరిశ్రమ కు సంబంధిన షేర్లను ఉంచు కోవడం ప్రమాదం. ఆ పరిశ్రమ సెంటిమెంట్ బలహీన పడినపుడు షేర్ల ధరలు తగ్గుముఖం పడతాయి. 

అపుడు మనం నష్ట పోతాం. కాబట్టి వేర్వేరు పరిశ్రమ లకు చెందిన షేర్లను ఎంపిక చేసుకోవడం మంచిది.అలాగే షేర్లను ఒకే సారి మార్చేయడం కూడా శ్రేయస్కరం కాదు.అన్నిటిని మార్చాలనుకుంటే మూడు నెలల కాలాన్ని లక్ష్యం గా పెట్టుకుని క్రమం గా మార్చాలి. పోర్ట్ ఫోలియో సంతృప్తి కరమైన లాభాలను అందిస్తున్నంత కాలం అందులో ఒక షేర్ బలహీనం గా ఉన్నా వెంటనే మార్చకూడదు. కొద్ది కాలం వేచి చూడాలి. ఏదో ఒక సమాచారం తెల్సింది కదా అని చీటికి మాటికి మార్పు చేయడం తెలివైన పని కాదు. స్వల్ప కాలిక వ్యూహాలను పాటించే ఇన్వెస్టర్లు మూడునెలలకు ఒక సారి పోర్ట్ ఫోలియో ను మార్చ వచ్చు.

ఇక రోజు వారీ కొనుగోళ్ళ లో రిస్క్ ఎక్కువ గా వుంటుంది. ఒక్కో సారి లాభాలు కూడా రావచ్చు.అదే రీతిలో నష్టాలు రావచ్చు.వీటిని  నివారించడం కష్టమే.ఇన్వెస్టర్లు తీసుకునే నిర్ణయాలు ఒక నిమిషం ఆలస్యమైనా నష్టాలు తప్పవు.
స్పెక్యులేషన్ లో రిస్క్ మరీ అధికం గా వుంటుంది. ఒక్కో సారి లాభాలు అధికంగా రావచ్చు.మరోక సారి పూర్తిగా మునిగి పోవచ్చు.రిస్క్ ని పూర్తిగా భరించే శక్తి గల వారు మాత్రమే ఈ తరహా ట్రేడింగ్ లో పాల్గొనాలి. స్వల్ప కాలిక వ్యూహాన్ని అనుసరించే ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకోకుండా రిస్క్ నుంచి బయట పడాలనుకుంటే  పైన చెప్పిన మెళకువలను పాటిస్తే భారీ లాభాలు గడించక పోయినా నష్టాలు మాత్రం రావు .

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!