వెబ్ సిరీస్ నిర్మాణంలోకి సింగర్ సునీత !

Sharing is Caring...

సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించిన సునీత వెబ్ సిరీస్ నిర్మాణంలోకి ప్రవేశించబోతోంది. సునీత భర్త రామ్ ఇప్పటికే వ్యాపారవేత్త. మ్యాంగో మాస్ మీడియా సంస్థను నడుపుతున్న రామ్ మరొకరితో కలసి ఈ మధ్యనే ఏక్ మినీ కథ  సినిమా నిర్మించారు. తాజాగా మ్యాంగో బ్యానర్ పై కొన్ని వెబ్ సిరీస్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ వేదికలు పెరుగుతున్నాయి. అందులో స్ట్రీమింగ్ చేస్తోన్న సిరీస్ కు డిమాండ్ పెరుగుతోంది.

ప్రస్తుతం అల్లు అరవింద్ నడుపుతున్న ఓటీటీ ఆహా కాకుండా ప్రముఖ నిర్మాత రామోజీ రావు కూడా మరో ఓటీటీ వేదిక కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవి రెండు తెలుగు వెబ్ సిరీస్ కి ప్రాధ్యాన్యమిస్తాయి. ప్రముఖ నటుడు నాగార్జున కూడా ఈ డిమాండ్ ను గుర్తించి వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ చేపట్టారు. అవన్నీ ఇపుడు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ బాటలోనే రామ్ కూడా సునీత తో కలసి అడుగులు వేస్తున్నారు. మ్యాంగో బ్యానర్ పై వెబ్ సిరీస్ తో పాటు  ఓటీటీ వేదికకు అవసరమయ్యే సంగీత కార్యక్రమాలు, టాక్ఇ షో లు .. ఇతర షోలను  రూపొందించాలని రామ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇవన్నీ కూడా ఆ రంగంలో అనుభవం గల సునీత పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటాయి. కొత్త టాలెంట్ ను ఎక్కువగా ప్రోత్సహించాలని  భావిస్తున్నట్టు సమాచారం.  ఇందుకు సంబందించిన తెర వెనుక పనులు నడుస్తున్నాయి. తెలుగునాట సునీత కు పెద్ద ఫ్యాన్  ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్లతో సమానమైన క్రేజ్ కూడా సునీత సంపాదించుకుంది. ఈ కొత్త వ్యాపారంలోకి అన్నింటా తానై కనిపించకుండా అవసరమైన సందర్భం లో స్టార్  యాంకర్ల గా పనిచేసిన  తన మిత్రురాళ్ల సహకారం కూడా తీసుకోవాలని సునీత భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాలేజీ రోజుల్లోనే ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించాలని  కలలు కన్న సునీత ఫీల్డ్ లో కొచ్చిన కొద్దీ కాలంలోనే తన సత్తా చాటుకున్నారు. టాలీవుడ్ లో సునీత డబ్బింగ్ చెప్పని తారలు కొద్దిమందే అని చెప్పుకోవాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!