నిజం చెబితే ఆమెను జైలుకు పంపారు !!

Sharing is Caring...

నిజం చెప్పడం నేరం! నిజం చెప్పినందుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అవును మరి అక్కడ నిజం చెప్పడం నేరమే. నాయకత్వానికి అప్రియమైతే దాన్ని ఉపేక్షించే ప్రశ్నే తలెత్తదక్కడ. ఆశ్చర్యపోవలసినపనేమీ లేదు. వీడెవడో పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. అనుకునేరు. అదేమీ కాదు. అలా అనుకునే అవసరం లేదు.ఇది అక్షరాలా నూరు పైసల నిజం. చైనా లో జరిగింది. అక్కడ జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎప్పటి నుంచో అక్కడి స్థితి అదే మరి.

అక్కడ మనుషులుంటారు.వారికి మెదళ్లు కూడా ఉంటాయి. కానీ ఆలోచించడానికి వీలు లేదు. ఆలోచించిన(నాయకత్వానికి రుచించని,అప్రియమైన) నా అది వ్యక్తం చేసే స్వేచ్ఛ అక్కడ లేదు.ఉండదు.అంతే మరి. ఆలోచనలను పసిగట్టగల యంత్రాన్ని ఇంకా తయారుచేయలేదు కాబట్టి అది అక్కడ వినియోగంలో లేదు.ఒకవేళ అలాంటి యంత్రం ఉండిఉంటే అది వినియోగించాడానికి ఆ దేశ నాయకత్వం ఏమాత్రం వెనకాడదు.

కరోనా వైరస్ పై నిజాలను చెప్పే ప్రయత్నంలో భాగంగా ఝాన్గ్ ఝూన్ అనే జర్నలిస్ట్ పలు కథనాలను రాసి ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. ఈ సత్య ప్రచారం ఆ దేశ నాయకత్వానికి కోపం తెప్పించింది మరి.తెప్పించదు మరి!ఆ సత్యం వారికి అప్రియమైనది కదా.అందుకే ఆవిడను  అరెస్ట్ చేశారు.ఆమె తప్పు /నేరం చేశారని నిర్దారించేశారు.. ఐదేళ్ల జైలు శిక్షనూ విధించేశారు. ఎంత గొప్ప సమాజమో కదా. కరోనా వైరస్ బయటపడినపుడు  ఝాన్గ్ ఝాన్ నిబద్దతతో పని చేశారు. కానీ ఆమె తప్పుడు ప్రచారం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. వివాదాలకు కారణమౌతున్నారని ,ప్రజలను  రెచ్చ గొడుతున్నారని ఆరోపిస్తూ చైనా అధికారులు తరచుగా కేసులు పెట్టడం మాములే . అదే తీరులో  ఝాన్గ్ ఝాన్ పై కూడా కేసు పెట్టారు. 

ఇలాంటి ఆరోపణలపై మరో ముగ్గరి పై కూడా కేసులు నమోదు చేశారు. వారి సమాచారం తెలియడంలేదు.జర్నలిస్ట్ లీ జెహువా క్వారంటైన్ లోఉన్నట్టు ఏప్రిల్ లో ప్రకటించారు. అలాగే  చెన్ కీషీ ప్రభుత్వ నిఘాలో ఉండగా … మూడో అతను ఫాంగ్ బిన్ ఆచూకీ తెలియడం లేదు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వార్తలను  రాసేవారిని ..ఉద్యమకారులను తీవ్రంగా అణచివేస్తారని చైనా నేతలకు పేరుంది.   చైనా మీడియా పై నియంత్రణ ఉన్న నేపథ్యంలో అసలు విషయాలు బయటికి రావడంలేదు. 

————– Govardhan Gande

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!