అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హాటల్ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడంతో కోర్టు భారీ జరిమానా విదించబోతోంది. ఈ కేసుపై విచారణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు చట్టఉల్లంఘన విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ పర్మిట్ కూడా 2017లో ముగిసింది … దాన్ని రెన్యూవల్ చేయలేదని అధికారులు కోర్టుకు తెలిపారు. పర్మిట్ లేకుండా హోటల్ నడపడం కూడా చట్ట ఉల్లంఘన గా కోర్టు భావిస్తోంది . చికాగోలోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ కొన్నాళ్లుగా ప్రభుత్వ అనుమతి లేకుండా చికాగో నది నుంచి మిలియన్ల కొద్దీ లీటర్ల నీటిని వినియోగిస్తున్నది. వెంటిలేషన్ కూలింగ్, వేడినీళ్ల కోసం.. ఏసీ సిస్టమ్స్ కోసం రోజుకు దాదాపు 20 మిలియన్ గ్యాలన్ల నదీ నీళ్లను వినియోగిస్తుందని ఆరోపణలు వచ్చాయి. 35 డిగ్రీలకు మించిన వేడి నీటిని తిరిగి నదిలోకి వదులుతోంది.దీని వల్ల చేపలు చనిపోతున్నాయి.
చేపల సంరక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలను ట్రంప్ హోటల్ ఉల్లంఘిస్తున్నట్లు 2018లోనే వార్తలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు కావడం తో కోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర అటార్నీ జనరల్ క్వామే రౌల్ ఈ కేసు లో చట్టాలను ఉల్లంఘిస్తున్న ట్రంప్ హోటల్ పై జరిమానా విధించాలని వాదించారు. జరిమానా మొత్తం దాదాపు 12 మిలియన్ డాలర్లు(రూ.87కోట్లు) ఉంటుందని అంచనా. ట్రంప్ భవనం పర్యావరణ సంరక్షణ చట్టం, కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. అటార్నీ జనరల్ గరిష్ట జరిమానా విధించాలని కోర్టును కోరారు. రెండు ఉల్లంఘనలకు ఒక్కొక్కటి $ 50,000, ఉల్లంఘనలు కొనసాగిన ప్రతి రోజుకు అదనంగా $ 10,000 జరిమానా విధించాలని అటార్నీ జనరల్ కోరారు. 12 మిలియన్లకు పైగా జరిమానా విధించవచ్చు అంటున్నారు. ఈ కేసు గురించి ట్రంప్ కంపెనీ కానీ ఆయన న్యాయవాది కానీ స్పందించలేదు. గతంలో ట్రంప్ సంస్థ ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించింది.
—————KNM