The structure is still a mystery…..
పై ఫొటోలో కనిపించేది భూటాన్ లో ఉన్న ఒక బౌద్ధ మఠం.దీన్ని పారో తక్త్సంగ్ మఠం అంటారు. భూటాన్ లో సందర్శించదగిన ప్రదేశాల్లో ఇదొకటి. నిటారుగా ఉన్న కొండపై నిర్మించిన బౌద్ధ మఠం వెనుక జానపద కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి.
బౌద్ధ గురువు ‘పద్మ సంభవుడు’మూడు సంవత్సరాల, మూడు నెలల, మూడు రోజుల, మూడు గంటలు ఇక్కడ తపస్సు చేశారని స్థానికులు చెబుతుంటారు.
నిటారుగా ఉండే ఈ కొండపైకి ఎక్కడం అంత సులభం కాదు. ‘గురు పద్మసంభవ’ టిబెట్ నుండి ఈ ప్రదేశానికి వెళ్లినట్లు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ‘టైగర్స్ నెస్ట్’ అని పిలుస్తారు. ఇక్కడ 1692 లో ఈ బౌద్ధ మఠాన్ని నిర్మించారు. దీనిని ధ్యాన కేంద్రంగా వినియోగించేవారు.
ఇది హిమాలయాలలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం.కొండ పక్కనుంచి పైకి వెళ్లేందుకు నడక దారి ఉంది.ఎక్కడం అంత సులభంకాదు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్లు ఈజీగా వెళ్ళగలరు.
ఆ కొండ పైన ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లో నిర్మాణం ఎలా జరిగిందో ఆశ్చర్యకరమైన విషయమే. ఇది భూటాన్ లోని పారో నగరం సమీపం లో ఉంది.కొండ పక్కనే పెద్ద లోయ కూడా కనిపిస్తుంది. పారో .. భూటాన్ పశ్చిమ హిమాలయాలలో ఉన్న ఒక పట్టణం.
ఇది 1962 వరకు దేశంలోని ప్రధాన సాంస్కృతిక, వాణిజ్య, రాజకీయ కేంద్రంగా విలసిల్లింది. భూటాన్‌లో పారో తక్త్సాంగ్, కైచు లాఖాంగ్, రిన్‌పుంగ్ జాంగ్‌లతో సహా మరికొన్ని బౌద్ధ ఆరామాలు ఉన్నాయి
‘గురు పద్మసంభవ స్మృత్యర్థం 1692 లో డ్రంగ్ డ్రంగ్ గయాల్ ఈ మఠాన్ని నిర్మించారు. మఠాన్నిఎలా నిర్మించారో మిస్టరీ. నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ఎలా అంత ఎత్తుకి తరలించారో ఎవరికి తెలీదు. ఇక ‘గురు పద్మసంభవ’ గురించి వివరించే కథలు చాలా ప్రచారం లో ఉన్నాయి. ‘పద్మసంభవ’ శ్రీలంకలోని ఉల్క పర్వతం శిఖరంపై కనిపించాడని కొందరు చెబుతారు.
ఆయన ఒరిస్సాలో పుట్టి పెరిగి , పెద్దయ్యాక భూటాన్ వచ్చాడని అంటారు. టిబెట్, నేపాల్, భూటాన్, దేశంలోని హిమాలయ ప్రాంతాల్లో బౌద్ధులు ‘పద్మసంభవ’ను రెండవ బుద్ధునిగా పూజిస్తారు. బుద్ధ శాక్యముని… పద్మ సంభవగా పునర్జన్మించారని భౌద్ధులు నమ్ముతారు.