ది రాంగ్ వైఫ్ !!

Sharing is Caring...

Money makes many things ……………………………..

ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే మహిళ పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. “ది రాంగ్ హజ్బెండ్” “ది రాంగ్ లవర్”  అనే నవలలు రాసి కొంత పాపులర్ అయ్యారు. 2011 లో  ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్” అనే పేరుతో ఒక వ్యాసం రాసి వార్తల్లో కెక్కారు.

ఇక ఆమె భర్త డేనియల్ బ్రోఫీ సౌత్ వెస్ట్ పోర్ట్ ల్యాండ్ లోని ఒరెగాన్ క్యులినరీ సంస్థలో పని చేసేవాడు. జూన్  2..  2018 ఉదయం ఒరెగాన్ ఇన్స్టిట్యూట్ వంటగదిలో డేనియల్ బ్రోఫీని ఎవరో కాల్చి చంపారు. విద్యార్థులు తరగతికి వచ్చినప్పుడు అతను నేలపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. నాన్సీ వివరాలన్నీ సేకరించారు.ఏడేళ్ల ముందు” హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్” అనే పేరుతో ఆమె రాసిన వ్యాసం విషయం కూడా వారి దృష్టి కొచ్చింది. పోలీసులకు అనుమానం వచ్చి నాన్సీ ని అరెస్ట్ చేశారు.

తొలుత ఆమె భర్త మరణం పోలీసులకు ఒక మిస్టరీ గా అనిపించింది. లోతుగా పరిశీలించడం మొదలు పెట్టారు.డేనియల్ పై రెండుసార్లు కాల్పులు జరిగాయని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. డేనియల్ సింక్ వద్ద నిలబడి విద్యార్థుల కోసం నీటి బకెట్లను నింపుతుండగా వెనుక నుండి ఒకసారి, రెండవసారి ఛాతీ పై దగ్గరగా కాల్చారు.

డేనియల్  వద్ద నగదు, క్రెడిట్ కార్డులతో కూడిన పర్సు దొరికింది. ఆ సంస్థలో దోపిడీ జరిగినట్టు లేదా బలవంతంగా లోపలికి ప్రవేశించిన సంకేతాలు లేవు.హత్య కేసు లో నిందితురాలిగా ఇరుక్కున్న నాన్సీ కస్టడీలో ఉంది. పోలీసులు చురుగ్గా విచారణ జరిపారు. చాలా సాక్ష్యాలను సేకరించారు.

ఎన్నో విచారణల తర్వాత ఆమెను అసలైన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ట్రాఫిక్ కెమెరా ఫుటేజ్లో ఆమె భర్త హత్య జరగడానికి ముందు ఆ ప్రాంతంలో ఆమె తిరిగినట్లు స్పష్టంగా కనిపించింది.. బ్రోఫీ దంపతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాల్పులకు రెండు సంవత్సరాల ముందే వారి పదవీ విరమణ ద్వారా వచ్చిన సొమ్మును ఖర్చుపెట్టారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

బహుళ జీవిత బీమా పాలసీలు,ఇతర ఆస్తుల నుండి $1.5 మిలియన్లకు పైగా పొందడానికి  తన భర్తను చంపాలని ఆమె పథకం వేసిందని ప్రాసిక్యూటర్లు కోర్టుకు వివరించారు. పోలీసులు హత్య కు వాడిన ఆయుధాన్ని కనుగొనలేకపోయినప్పటికీ, ఆమె అదే కంపెనీ మోడల్ తుపాకీని కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపారు.

మొత్తం మీద సుమారు నాలుగేళ్ళ విచారణ అనంతరం కోర్టు ఆమెకు జూన్ 14, 2022న జీవిత ఖైదు శిక్ష విధించింది.న్యాయమూర్తి సుమారు 10 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆమె అక్రమ సంపాదనతో చాలా లాభపడిందని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఆమె గతంలో ఎలాంటి నేరాలకు పాల్పడలేదట.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!