ఈ చిత్రం వెనుక కథ ఏమిటో ?

Sharing is Caring...

Sheik Sadiq Ali ………………………………………………

ఈనాడు దేశవ్యాప్తంగా బౌద్ధ,జైన,శైవ,వైష్ణవ ఆలయాల ప్రాంగణాల్లో వివిధ రూపాల్లో,వివిధ నామాలతో కన్పించే పలు విగ్రహాలకు మూలం ఈ చిత్రమే. కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో మూల విరాట్టులు సైతం ఇవే పోలికలతో ఉంటాయి.  కాకపొతే రెండు చేతులు అదనంగా ఉంటాయి. ఆ చేతుల్లో ఉండే ఆయుదాలో, వస్తువులో మారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల భంగిమల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఇంతకూ ఈ చిత్రం ఎక్కడ ఉంది? దీని కథ ఏమిటో తెలుసు కుందాం.

మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ (ఒకప్పుడు నైజాం పాలనలో ఉండేది) కు వంద కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య అజంతా గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 650 వ సంవత్సరం వరకు, ఆ మధ్యకాలంలో చిత్రించిన గుహా చిత్రాలు ఉన్నాయి.అలాంటి చిత్రాల్లో ఈ పద్మపాణి చిత్రం ఒకటి.

మొదటి గుహలో లోపలి భాగాన ఒక రాతిలో చెక్కిన ఒక బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని సందర్శించుకునేందుకు భక్తులు వెళ్లే మార్గం ప్రారంభంలో ఈ చిత్రం ఉంటుంది. తలపై కిరీటం, చేతిలో పద్మం పట్టుకొని ,లోపలి వెళ్లే భక్తులను క్రీగంట చూసే భంగిమలో ఉంటుంది.

అంటే బుద్ధ మూర్తికి ద్వార పాలకుడి పొజిషన్ అన్నమాట. మన శైవ, వైష్ణవ ఆలయాల ద్వారపాలకుల రూపాలు, భంగిమలు ఇంచుమించు ఇలానే ఉంటాయి.ఆఖరికి జైన ఆలయాల ముఖ ద్వారాలు,స్థంభాలపై కూడా ఈ రూపాలు విస్తృతంగా కన్పిస్తాయి.

ఈ చిత్రం క్రీస్తు శకం 480 -500 మధ్య కాలంలో చిత్రించి ఉంటారని పరిశోధకులు అంచనా వేశారు.అజంతా గుహలు కుడ్య చిత్రాలకు ,శిల్పకళా నైపుణ్యానికి ప్రసిద్ధి గాంచినవి. మొత్తం 16 గుహల్లో చిత్రాలు ఉన్నాయి. గోడల మీద బుద్ధుని వివిధ రూపాలు , రేఖా చిత్రాలు , పువ్వులు పక్షులు ,జంతువుల బొమ్మలు కనిపిస్తాయి.

ఒకటో గుహలో పద్మపాణికి ఎదురుగా సర్వాలంకార భూషితుడైన వజ్రపాణి రూపంలో బుద్ధుడు కనిపిస్తాడు. అజంతా గుహల్లో ఇవి ప్రసిద్ధ కళాఖండాలు. ముఖ ద్వారానికి ఎడమ వైవు న శిబి చక్రవర్తి కి సంబంధించిన కథలపై చిత్రాలు ఉన్నాయి. ఆ పక్కనే గోడలపై బుద్ధుని జీవితంలోని ప్రముఖ ఘట్టాలపై చిత్రాలు కనిపిస్తాయి. ఇవన్నీ పెద్దవిగా ఉంటాయి. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని చిత్రం లోని నేత్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి.

కాగా రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొందినవారు మాత్రమే బోధులు అవుతారు. వివిధ బౌద్ధ సంప్రదాయాలలో పలువురి  బుద్ధుల ప్రస్తావన ఉంది. “బోధీసత్వత” అనే నిర్వాణ స్థితిని పొ౦దడం ఈ సంప్రదాయానికి మూలసూత్రం.

భారతీయ బౌద్ధ సాంస్కృతిక రంగంలో అంగీకరించబడిన లోకేశ్వర ప్రత్యేక రూపమే పద్మపాణి అవలోకితేశ్వర. ఈ బోధిసత్వుడైన అవలోకితేశ్వర ను కొన్ని దేశాలలో దేవుడిగా భావిస్తారు . ఇక ఈ పద్మపాణి  అసాధారణమైన  చిత్రానికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!