నేల కొరిగిన సినిమా చెట్టు !!

Sharing is Caring...

 In the memories ………………………

ఆ సినిమా చెట్టు కూలిపోయింది .. దాన్ని కుమారదేవం చెట్టు అని పిలుస్తారు.వందకు పైగా సినిమా షూటింగ్ లు ఆ చెట్టు పరిసరాల్లోనే జరిగాయి. అందుకే దాన్ని సినిమా చెట్టు అని పిలుస్తారు. ఇప్పుడది చరిత్రలో కలసి పోయింది.

ఇవాళ తెల్లవారుజామున వచ్చిన గోదావరి వరద తాకిడికి ఆ చెట్టు కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో  గోదావరి ఒడ్డున  ఈ నిద్ర గన్నేరు మొక్కను  సింగలూరి తాతబ్బాయి అనే అయన నాటాడట. అది పెరిగి మహావృక్షమైంది.  ఎందరికో నీడ నిచ్చింది. ఎన్నో సినిమా షూటింగ్లకు  కేంద్రమైంది. 

పాడిపంటలు ,దేవత ,వంశవృక్షం,బొబ్బిలిరాజా,హిమ్మత్ వాలా,సీతారామయ్యగారి మనవరాలు ఇలా  ఎన్నో సినిమాల షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇక్కడ సినిమా తీస్తే హిట్ కొట్టడం ఖాయం అనే సెంటిమెంట్ కూడా ఉందని చెబుతారు. ప్రముఖ దర్శకుడు వంశీ ఈ చెట్టు దగ్గర 18 సినిమాలు తీసారట.

అలాగే  విశ్వనాధ్ ,రాఘవేంద్రరావు , దాసరి నారాయణ రావు, జంధ్యాల,  ఇవివి… ఇలా ఎందరో డైరెక్టర్లు ఈ చెట్టు నీడన సేద తీరిన వారే .. ఇది 145 ఏళ్లనాటి సినిమా చెట్టు.. ఎన్నో తుఫాన్లను .. గాలి వానలను చూసిన ఈ సినిమా చెట్టు వరద తాకిడికి కూలి పోయింది. స్థానికులు.. జిల్లా వాసులు వచ్చి చూసి వెళుతున్నారు. నాలుగు రోజులు పోతే చెట్టు తాలూకూ అవశేషాలు కూడా మిగలవు. కొందరికి మాత్రం  జ్ఞాపకాలలో మిగిలిపోతుంది. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!