ఆనాటి సినిమాల తీరే వేరు!

Sharing is Caring...

Subramanyam Dogiparthi …………….  The bond of brothers and sisters 

రక్త సంబంధం తర్వాత అన్నాచెల్లెళ్ళ బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ ఏ రోజుల్లో అయినా పండుతుంది. ఎన్టీఆర్ చేసిన రక్త సంబంధం, ఆడపడుచు, చిట్టిచెల్లెలు .అక్కినేని నటించిన బంగారుగాజులు , రజనీకాంత్-కీర్తి సురేష్ పెద్దన్న , రాధిక-శశికుమార్ రక్తసంబంధం , రాజశేఖర్ గోరింటాకు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అయితే NTR తో మరొకరిని పోల్చలేం. ఈ సినిమాలో కూడా మనకు ఎన్టీఆర్-సావిత్రిలను గుర్తుకు తెస్తారు NTR-వాణిశ్రీ. ఎలా అయితే రక్తసంబంధం సినిమా చూసి కళ్ళు చెమర్చకుండా ఉండవో , అలాగే ఈ చిట్టిచెల్లెలు సినిమా కూడా . NTR నటన ఎంతటి పాషాణ హృదయుడికయినా కళ్ళు చెమర్చాల్సిందే.  

యస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన ఈ సినిమాలో ఈ రేయి తీయనిది’ పాట తరచుగా వినిపిస్తుంటుంది. సినారే ఈ పాట రాశారు. అలాగే ‘జుం జుం జుం తుమ్మెద పాడింది’ వంటి పాట కూడా ప్రజాదరణ పొందిన పాటే. దాశరధి వ్రాసిన అందాల పసిపాపా అందరికీ కనుపాపా పాట మూడు సార్లు వస్తుంది . సాహిత్యం , సంగీతం , సుశీల -ఘంటసాలల గాత్రం చాలా గొప్పగా ఉంటాయి.

NTR సినిమా అంటే ఎలాగోలాగా ఓ మారు వేషం ఉండాల్సిందే కదా .. ఈ సినిమాలో మారు వేషమయితే ఉండదు కానీ , ఓ నాటకం వేషం మాత్రం ఉంటుంది . అది శ్రీరామ వనవాసం నాటకంలో రాములోరి పాత్ర . ఆయన నటించడం ఏంటి నా మొహం .. ఆయనే రాముడయితే ఈ నాటకంలో ఆయనతోపాటు సీతగా గీతాంజలి , లక్ష్మణుడిగా పద్మనాభం , శూర్పణఖ గా సురభి బాలసరస్వతి నటిస్తారు. 

గీతాంజలి మరోసారి versatile నటి అని మనం కితాబు ఇవ్వక తప్పదు . NTR జోడీగా రాజశ్రీ కి చాలా హుందా అయిన పాత్ర లభించింది ఈ సినిమాలో . ప్రేమించిన వ్యక్తికి అండగా నిలబడే పాత్ర . ఇప్పటి తరం ప్రేమికులకు ఆశ్చర్యం కూడా కలుగుతుందేమో.. ఇప్పుడు ప్రేమంటే use & throw కదా ! సతీ సుమతిలు , సతీ సావిత్రిలు , శ్రీరామచంద్రులూ ఎక్కడ దొరుకుతారు . Materialistic , opportunistic and pecuniary relationships. 

మహిళల మెప్పు పొందిన ఈ సినిమా వంద రోజులు ఆడింది . కమర్షియల్ గా , కళాపరంగా , అన్ని కోణాల్లో గొప్ప చిత్రం. వాణిశ్రీ కెరీర్ పరంగా ఎదగడానికి దోహదపడిన చిత్రం. ఏవిఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రం 1970 ..లో విడుదలైంది. నటులు రేలంగి.. హరనాధ్, రాజశ్రీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం ఇతర పాత్రల్లో నటించారు. తమిళ దర్శకుడు కృష్ణన్ డైరెక్ట్ చేశారు. యూట్యూబ్ లో సినిమా ఉంది చూడొచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!