కపిల్ చెలరేగి ఆడిన …ఆరోజు ఏం జరిగిందంటే ?

Sharing is Caring...

కఠారి పుణ్యమూర్తి ……………………………………………. 

Greatest  cricketer ………………………………………ముప్ఫైఎనిమిది ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు…..అంటే 25th జూన్ 1983….భారత దేశ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన రోజు… ఇండియా వన్డే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన రోజు. బలమయిన ఆటగాళ్లను నిచ్చినా జట్టులో స్ఫూర్తి నింపలేక చతికిల పడే మామూలు నాయకుడు కాదు అప్పటి నాయకుడు “కపిల్ దేవ్, ది గ్రేట్”. 

భారత క్రికెట్లో ఎంతమంది తెండూల్కర్లు, ధోనీలు, కోహ్లీలు వున్నా ఆ మహా ఆటగాడి ముందు దిగదుడుపే….అనామక జట్టుగా టోర్నీలో అడుగుపెట్టి, ఫైనల్ కు చేరడమే చాలా గొప్ప విషయం అప్పట్లో…ఫైనల్ కు వారం రోజుల ముందు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అయిదుగురు, కేవలం 17 పరుగులకే అవుట్ అయిపోయారు.

ఆ మ్యాచ్ ఓడితే టోర్నీ నుండి ఔట్…అటువంటి విషమ దశలో క్రీజులో అడుగుబెట్టిన కపిల్ దేవ్, చెలరేగిపోయి 138 బంతుల్లో 175 పరుగులు (నాటౌట్) చేయడంతో 266 పరుగుల భారీ స్కోర్ సాధించి తర్వాత జింబాబ్వే ని 233 పరుగులకే కట్టడి చేసి మరిచిపోలేని విజయం అందుకున్నారు… దురదృష్టం ఏమిటంటే బీబీసీ వారు ఆరోజు ధర్నా చెయ్యడంతో ఈ మ్యాచ్ అస్సలు లైవ్ కాదు కదా కనీసం కెమెరాల్లో కూడా రికార్డు కాలేదు (ఈ మ్యాచ్ గురించి ఇంకో పోస్ట్ లో వివరిస్తా).

తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ని ఓడించి ఫైనల్ కి చేరుకున్నా మన జట్టు మీద ఎవరికీ నమ్మకం లేదు…కారణం ఫైనల్ ప్రత్యర్థి జట్టు హేమాహేమీలతో కూడిన వెస్టిండీస్…హేన్స్, గ్రీనిడ్జ్, లాయిడ్, కింగ్ రిచర్డ్స్ వంటి దిగ్గజ బ్యాటర్లు, ఆండీ రాబర్ట్స్, జోయల్ గార్నర్, మాల్కం మార్షల్, మైఖేల్ హోల్డింగ్ లాంటి అరివీర భయంకరమైన ఫాస్టుబౌలర్ల ధాటికి ఇండియా ఎదురు నిలిచి గెలుస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు.

అప్పటికే వెస్టిండీస్ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ కూడా… అనుకున్నట్టుగానే ఫైనల్ లో మనోళ్లు తక్కువ స్కోరుకే (183) కి ఆల్ ఔట్… కానీ స్ఫూర్తివంతమైన కపిల్ కెప్టెన్సీ లో మనోళ్లు విండీస్ ని కేవలం 140 పరుగులకే అందర్నీ ఔట్ చేసి నమ్మశక్యంగాని విజయం సాధించి ప్రపంచమంతా నివ్వెరపోయేలా చేశారు.

ఈ మ్యాచ్లో రిచర్డ్స్ కొట్టిన భారీ షాట్ ని దాదాపు 20 అడుగులు వెనక్కి పరిగెత్తుతూ కపిల్ అందుకున్న క్యాచ్ అద్భుతమైన టర్నింగ్ పాయింట్.. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు.

తన సత్తా చూపే వాడు. కపిల్ దేవ్ సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. 1994, జనవరి 30న శ్రీలంకపై బెంగుళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజీలాండ్కు చెందిన రిచర్డ్ హాడ్లీ రికార్డును అధిగ మించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు, 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు. 

1988లో జోయెల్ గార్నల్ రికార్డును అధిగమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల కెక్కాడు.  వన్డేలలో సెంచరీ సాధించిన మొట్ట మొదటి భారతీయుడు ఈయనే. లార్డ్స్ మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఆ ఖ్యాతి పొందిన తొలి బ్యాట్స్‌మెన్‌ ఈ హర్యానా హరికెనే. 
భారత క్రికెట్లో “కపిల్ దేవ్ నిఖంజ్” ని మించిన మొనగాడు నాయకుడు లేడు….రాబోడు..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!