వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహిస్తోన్న ‘అంతరిక్ష యానం’ లో అమెరికా భారతీయ సంతతికి చెందిన శిరీష బండ్ల పాల్గొంటున్నది. శిరీష తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి.ఈ నెల 11 న వీ ఎస్ ఎస్ యూనిటీ వ్యోమ నౌక ద్వారా అంతరిక్షంలోకి టీమ్ తో కలసి ప్రయాణించబోతున్నది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కి చెందిన డాక్టర్ మురళీధరరావు డాక్టర్ అనురాధ దంపతుల కుమార్తె ఈ శిరీష. ఈ కుటుంబం చాలా కాలం క్రితం అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయింది. శిరీష చదువు ..ఉద్యోగం అన్నీ అక్కడే. అంతరిక్షంలోకి వెళుతున్న ఆరుగురి టీమ్ లో శిరీష ఒకరు. కల్పనా చావ్లా ఇండియన్ అమెరికన్ సునీత విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న భారతీయ సంతతి మహిళల సరసన శిరీష చేరారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయి.


