ఫోటోల వెనుక కన్నీళ్లు .. కష్టాలు!!

Sharing is Caring...

పై రెండు ఫోటోలు ఈ యేటి మేటి ఫోటోలు గా యునిసెఫ్ చే ఎంపికైనాయి. కరోనా నేపద్యంలో ఒక ఫోటోలో పిల్లలు దూరం దూరంగా కూర్చొని చదువుకుంటున్నారు. మరొక ఫొటోలో  కాలం తెచ్చిన కష్టాలకు నష్టాలకు కన్నీళ్లు సైతం ఇంకిపోయి బేలగా నిలబడిన బెంగాలీ బాలిక కనిపిస్తున్నది.  

వీటిలో పిల్లలు చదువుకుంటున్న ఫోటో సెకండ్ బెస్ట్ ఫోటో అఫ్ ది ఇయర్ 2021 గా… నిస్సహాయంగా చూస్తున్న బాలిక ఫోటో ఫస్ట్ బెస్ట్ ఫోటో అఫ్ ది ఇయర్ 2021 గా ఎంపికైనాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవన స్థితిగతులకు దర్పణం పట్టే ఫోటోలకు యునిసెఫ్‌ అవార్డులు ప్రకటిస్తున్నది. ఈ సారి ఈ రెండు అవార్డులు భారతీయులకే రావడం విశేషం. 

పశ్చిమబెంగాల్‌ లోని అందమైన సుందర్‌బన్‌ అటవీ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నోఉన్నాయి. అలాంటి కుటుంబాలలో పై ఫొటోలో కనిపిస్తున్న12 ఏళ్ల పల్లవి కుటుంబం కూడా ఉంది. గంగా నది పరీవాహక ప్రాంతంలోని నంఖానా ద్వీపంలో పల్లవి కుటుంబం నివసిస్తోంది. తండ్రి ట్రక్కు డ్రైవర్ గా చేస్తున్నాడు. ఆతని ఆదాయం చాలక పోవడంతో పల్లవి టీ దుకాణం పెట్టింది.

ఆర్ధిక కష్టాలతో జీవనం సాగిస్తున్న వారిపై 2020లో తుపాను విరుచుకుపడింది. తుపాను కారణంగా గంగా నది పొంగి పలు గ్రామాలను ముంచెత్తింది. పల్లవి ఇల్లు  ..టీకొట్టు కొట్టుకుపోయాయి. వరద ప్రాంతాల ఫోటోలు తీసేందుకు వెళ్లిన  సుప్రతిమ్‌ కి.. నిస్సహాయ స్థితిలో నిల్చున్న పల్లవి కన్పించింది. వెంటనే కెమెరా క్లిక్ మనిపించాడు.ఈ ఫొటోను యునిసెఫ్‌ అవార్డులకు పంపించాడు.దానికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 

కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల పరిస్థితులను సౌరవ్‌ దాస్‌ తన కెమెరాతో బంధించారు. అందులో ఒకటి పైన కన్పిస్తున్న చిత్రం. గత ఏడాది  కాలంగా కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు మూత బడ్డాయి. అవకాశం ఉన్న చోట్ల ఆన్‌లైన్‌ విద్య మొదలు పెట్టారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేవు. చదువు కుంటుపడింది. 

దీంతో టీచర్లు విద్యార్థులకు పాఠాలు చెప్పడం లేదు. పిల్లలు నేర్చుకున్నది కూడా మర్చిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో దీప్‌ నారాయణ్‌ అనే టీచర్  గ్రామంలోని ప్రతి ఇంటి గోడలను బ్లాక్‌బోర్డుల్లాగా మార్చేశాడు. పిల్లలను దూరం దూరం గా కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. ఆ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన సౌరవ్‌ దాస్‌ తీసిన ఫోటో సెకండ్ బెస్ట్ ఫోటోగా ఎంపికైంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!