New Take Over …………………………………
పట్టణాలలో , నగరాలలో Bisleri brand water గురించి తెలియని వారు అరుదు అని చెప్పు కోవచ్చు. భారత్ లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్ లో ఎక్కువ మంది ఎంచుకునే బ్రాండ్ ఇదే. ఇపుడు ఆ బ్రాండ్’ టాటా’ గ్రూప్ చేతిలోకి వెళ్లబోతోంది.
బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ రమేష్ చౌహాన్ ఈ సంస్థను టాటాకు విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు కంపెనీల మధ్య అంగీకార ఒప్పందం ఇంకా కుదరలేదు. చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ. 6000 కోట్ల నుంచి రూ. 7000 కోట్ల మధ్య ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు.
రమేష్ చౌహాన్ ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆయన కుమార్తెకు బిజినెస్ పట్ల ఆసక్తి లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో రమేష్ Thums Up, Limca, Gold Spot వంటి పాపులర్ బ్రాండ్ కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. తర్వాత వాటిని కోకా కోలా కంపెనీ కి అమ్మేశారు. ప్రస్తుతం అయితే bisleri ని టాటా లకు ఇవ్వాలని భావిస్తున్నారు.
టాటా ఇప్పటికిప్పుడు టేకోవర్ చేసుకున్నప్పటికీ ప్రస్తుత మేనేజ్మెంట్ రెండేళ్ల పాటు కొనసాగాలన్న ఒప్పందంతో డీల్ కుదుర్చుకోబోతున్నారని మార్కెట్ వర్గాల సమాచారం. రూ.220 కోట్ల లాభంతో అతి పెద్ద ప్యాక్ట్ డ్రింకింగ్ వాటర్ కంపెనీగా bisleri దూసుకుపోతోంది.
ఇక టాటా ఇప్పటికే ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలో హిమాలయన్ బ్రాండ్ పేరుతో, Tata Copper Plus Water బ్రాండ్ పేరుతో మినరల్ వాటర్ ను Tata Consumer Products కంపెనీ ద్వారా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Hydration Segment లో కూడా Tata Gluco+ కు మంచి మార్కెట్ ఉంది. 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ఇండియన్ బాటిల్డ్ వాటర్ మార్కెట్ విలువ 2400 మిలియన్ డాలర్లు కాగా 2027 నాటికి 4800 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇదిలా ఉండగా.. టాటాలు bisleri ని టేకోవర్ చేసాక దాని పేరు మార్చే అవకాశాలు లేవు.