టార్జాన్ ఆఫ్ కరాచీ !

Sharing is Caring...

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ఫర్మాన్ అలీ.. వయసు 28 ఏళ్లు.. పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ఈ వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా ఓ చెట్టుపై నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే జీవిస్తున్నాడు. ఎవరూ వచ్చి అతగాడిని డిస్ట్రబ్ చేయలేదు.  చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న పొదరింటిలో హాయిగా ఉంటున్నాడు.

ఆ ఇల్లు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడిని చాలా మంది – టార్జాన్ ఆఫ్ కరాచీ- అని పిలుస్తున్నారు. అయితే ఇతగాడు చెట్టు మీద నివసిస్తోంది తన అభిరుచి వల్ల కాదు.. పేదరికం కారణంగానే. అమ్మను, నాన్నను కోల్పోయిన తర్వాత కొద్ది రోజులు రోడ్ల పక్కన ఫుట్ పాత్ మీద, పార్కుల్లోనూ పడుక్కునే వాడిని.

ఆయా స్థలాల్లో ఎవరూ నన్ను ఎక్కువ రోజులు ఉండనిచ్చే వారు కాదు. అద్దె ఇల్లు తీసుకునేంత ఆర్ధిక శక్తి లేదు. అందుకే చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వర్షం, చలి నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు వెదురు, పాత తలుపు చెక్కలు, దుప్పట్లతో ఓ ఆవాసం ఏర్పాటు చేసుకున్నా. ఇక్కడకు వచ్చాక నాకు ప్రశాంతంగా ఉంది. ఈ ఎనిమిదేళ్లలో ఎవరూ నన్ను వెళ్లగొట్టడానికి ప్రయత్నించలేదని చెప్పాడు.

కార్లు కడిగి, రోడ్లు తుడిచి, ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసి ఫర్మాన్ తన తిండికి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటాడు. కొందరు జాలిపడి ఆహారం కూడా ఇస్తుంటారు. ఆ చెట్టు మీదే ఫర్మాన్ ఒక చిన్న వాష్ బేసిన్, బ్యాటరీతో పని చేసే బల్బు, వంట చేసుకోవడానికి ఎలక్ట్రిక్ స్టవ్ లాంటి వస్తువులను అమర్చుకున్నాడు.అన్నట్టు ఇతగాడికి గతంలో వివాహం అయింది. అతగాడి పేదరికం చూసి భార్య వదిలేసి వెళ్లిపోయిందట. అయినా నిరాశ పడకుండా ధైర్యంగా జీవిస్తున్నాడు. మొత్తానికి ఫర్మాన్ ట్రీ హౌస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!