హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు!
ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె పాదాలకు ప్రణమిల్లుతాయి. ఒకటవ హరిశ్చంద్రుడు ముప్పాల …