నల్లమల జంగిల్ క్యాంప్ కి వెళ్ళారా ?
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు క్యాంపుల్లో ఎకో టూరిజం మెల్లగా ఊపందుకుంటోంది. వారాంతాల్లో, సెలవు రోజులలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. నల్లమల అడవుల్లోని ప్రకృతి అందాలు , ప్రశాంత వాతావరణం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అక్కడ సహజ సిద్దంగా ఉండే ఎన్నో వన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ …