కరుణానిధి అర్థరాత్రి అరెస్ట్… ఆరోజు అసలేం జరిగింది ?
Bhavanarayana Thota………………… 2001 మే నెలలో తమిళనాట జయలలిత మరో విడత ముఖ్యమంత్రి కాగానే అందరి మనసులో రకరకాల ప్రశ్నలు. పగకూ, పట్టుదలకూ మారుపేరైన జయలలిత తన అరెస్టునూ, జైలు జీవితాన్ని మరువగలరా? ప్రజాతీర్పు ఆమెను క్షమించారనటానికి సంకేతం అనుకుంటారా? ప్రతీకారం తీర్చుకోవటానికి ఇచ్చిన అవకాశమనుకుంటారా? తనమీద ఎన్నో కేసులు పెట్టిన కరుణానిధిని అరెస్ట్ చేస్తారా? …
