సప్త వెధవా? అంటే….అదా అర్ధం! ‘కన్యాశుల్కం’తిట్ల కథా కమామీషు ఏమిటో ?
Jayanthi Chandrasekhararao…………………… ‘కన్యాశుల్కం’ నాటకంలో ఉపయోగించిన తిట్లు కాలక్రమంలో మరుగున పడిపోయాయి .. ఆ తిట్లకు విశేష అర్ధాలున్నాయి .. వాటి విషయం ఏమిటో చూద్దాం. *“నన్ను సప్తవెధవని చేశావు”* అంటాడు రామప్పంతులు మధురవాణితో! ‘సప్తవెధవ’ అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ …
