Haunted place …………………………….
డుమాస్ బీచ్…. ఈ బీచ్ గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉంది.అద్భుతమైన సూర్యాస్తమయాలకు ఈ బీచ్ ప్రసిద్ధి గాంచింది. అలాగే ఇండియాలోని అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా కూడా పాపులర్ అయింది.చీకటి పడితే బీచ్ లో ఉండటానికి జనాలు భయపడతారు. అక్కడ ఆత్మలు సంచరిస్తాయని చెబుతారు.
డుమాస్ బీచ్ నల్ల ఇసుకతో ఉంటుంది. ఇది దాని ప్రత్యేక ఆకర్షణ.ఈ బీచ్ గురించి భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ అశాంతి తో ఉన్న ఆత్మలు తిరుగుతాయని నమ్ముతారు. ఈ బీచ్‌లో అనేక స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ వివిధ రకాల ఆహార పదార్థాలను ఆస్వాదించవచ్చు.అలాగే గుర్రపు స్వారీ, ఒంటెల స్వారీ కూడా చేయవచ్చు.
డుమాస్ బీచ్ గురించి భయానక కథలు ఉన్నప్పటికీ, ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమే .. డుమాస్ బీచ్‌ను అక్టోబర్ నుండి మార్చి మధ్యలో సందర్శించడం మంచిది. అప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.బీచ్ ఉదయం పూట టూరిస్టుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించిన తరువాత మాత్రం అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడు.
ఒకప్పుడు ఈ బీచ్ శ్మశాన వాటిక అనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ దహనం చేయబడిన వ్యక్తుల తాలూకూ ఆత్మలు తిరుగుతుంటాయని స్థానికులు నమ్ముతారు,ఈ ప్రదేశం అనేక పారానార్మల్ కార్యకలాపాలకు వేదిక అని అంటారు.
బీచ్ లో నడుస్తున్నపుడు మనిషి కనబడకుండా చెవిలో యేవో గుసగుసలు వినిపించడం, శరీరం లో ఏదో ఒక చోట ఒక్కసారిగా చల్లగా అనిపించడం, ఎవరో పట్టుకుని లాగుతున్న అనుభూతి కలగడం.. పక్కనే ఎవరో నడుస్తున్న ఫీలింగ్ .. ఇసుకలో కదలికలను చూడటం వంటి వింతైన అనుభవాలు సందర్శకులకు ఎదురయ్యాయని అంటారు.రాత్రిపూట బీచ్ నుండి విచిత్రమైన స్వరాలు, అరుపులు, నవ్వులు కూడా వినిపిస్తాయిట .
డుమాస్ బీచ్ చుట్టూ ఇలాంటి ఓ భయానక కథలు అల్లుకుని ఉన్నాయి.చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన వారు మాత్రం రాత్రి వేళల్లో అటుగా వెళ్లాలంటేనే భయపడిపోతారు. రోడ్డు ద్వారా అయితే సూరత్ అహ్మదాబాద్ నుండి 234 కిమీ, వడోదర నుండి 154 కిమీ, ముంబై నుండి 297 కిమీ దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ సూరత్ జంక్షన్, ఇది డుమాస్ బీచ్ నుండి (22.6) కిమీ దూరంలో ఉంది..సూరత్ వెళ్ళినపుడు తప్పక చూసి రండి.ఈ బీచ్ కి కొంచెం దూరంగా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.


