పద్యాలు పాడటమంటే అంత సులభం కాదు …వాటిని పాడి మెప్పించాలంటే కఠోర సాధన చేయాలి. అలవోకగా సుదీర్ఘ రాగాలను తీయాలి.ప్రేక్షకులను మెప్పించేలా పాడాలి. అపుడే ఒన్స్ మోర్ అంటూ ఈలలు ..కేకలతో ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తారు. ఇది అందరికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు.
అందుకే చాలామంది పాటలకే పరిమితమౌతారు. పద్యాల జోలికి వెళ్ళరు. మహిళలు మరీ దూరంగా ఉంటారు. అయితే ఫొటోలో ఉన్న అమ్మయి మాత్రం కాటి సీను పద్యం అదరగొట్టేసింది. సత్య హరిశ్చంద్ర లో గుర్రం జాషువా రాసిన కాటి సీను పద్యాలూ అజరామరమైనవి. ఎందరో కళాకారులూ వాటిని జనాల్లోకి తీసుకెళ్లి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ తరం వారికి అంతగా కాటిసీను పద్యాల గురించి తెలియక పోవచ్చు. ఇపుడు పద్య నాటకాలను ప్రదర్శించేవారు కూడా లేరు. ఆడియోలు, వీడియోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇక అసలు కథ లోకి వస్తే ఫోటోలో కనిపించే యువతి పేరు శివాని. కాటి సీను పద్యాన్ని ఎంత అద్భుతంగా పాడిందో చూడండి. ఎన్ని రోజులు ఎంత సాధన చేసిందో ఏమో కానీ ఎస్పీ బాలు అంతటి వాడు ఆ పద్యం విని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎమోషనల్ గా ఫీలయ్యాడు. ఆమె వాయిస్ లో అంత ఎమోషనల్ టచ్ ఉంది. మీరు కూడా చూస్తూ వినండి. ఈ టీవీ వారు నిర్వహించిన పాడుతా తీయగా లో శివాని పాల్గొని అందరి ప్రశంసలు పొందింది.
pl. watch vedeo.. ఎన్నో ఏళ్ళు గతించినవి