బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సౌత్ దర్శకులు !!

Sharing is Caring...

 Sankeertan ………………………….           Bollywood’s red carpet for South movies

సంజయ్ లీలా బన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ‌లు హిందీ బడా దర్శకులుగా సాగుతున్న కాలమది. నిజానికి ఈ ఇద్దరు దర్శకులకు  బాలీవుడ్‌లో మంచి సినిమాలు తీస్తారన్న గుర్తింపు ఉంది. ఇక వీళ్లు కాక బాలీవుడ్‌ను బతికించే నాధుడే లేడకుంటున్న టైమ్‌లో వచ్చాడు రాజమౌళి.

బాహుబలితో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. హిందీ బెల్ట్‌ను మొత్తం సౌత్ వైపు తిప్పుకునేలా చేశాడు. బాహుబలి దెబ్బతో బాలీవుడ్ బయ్యర్లు కూడా సౌత్ సినిమాలను బాలీవుడ్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేయడం ప్రారంభించారు.

బాహుబలి… నార్త్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన సినిమా. ఒక్క బాలీవుడ్ నటుడు లేడు.. ఈ సినిమా ఏం ఆడుతుందిలే అన్న ధీమాతో ఉన్న బాలీవుడ్ ప్రముఖులకు బాహుబలి విజయాన్ని చూసి.. మూర్చపోయినంత పనైయింది.

రాజమౌళి అంటే సౌత్ అన్న బాలీవుడ్ జనాలకు రాజమౌళి అంటే సౌత్ కాదు.. ఇండియన్ అని నిరూపించాడు జక్కన్న. అప్పటి వరకు రాజమౌళినే సరిగ్గా గుర్తించని హిందీ హీరోలు.. బాహుబలి, బజరంగి బాయిజాన్ దెబ్బతో విజయేంద్ర ప్రసాద్‌ను చూసి క‌ళ్లు బైర్లు కమ్మాయి.

రాజుల కథ, భారీ యుద్ధాలు, గ్లాడియేటర్‌ను మించిన పోరాట సన్ని వేశాలు, కరేబియన్ పైరెట్స్‌ స్థాయిలో నటుల వేషధారణలు, విభిన్న భాషలతో వైవిధ్యమైన కథనం… ఇది మొత్తంగా బాహుబలి సారాంశం.

ఇంత పెద్ద సినిమా.. అంత పెద్ద స్టార్ కాస్టింగ్.. చూపు తిప్పుకోలేని.. కళ్లార్పలేని సన్నివేశాలు… ఇలా బాహుబలి అనేక విశేషాల సమాహారమైంది. కనుచూపు మేరలో బాలీవుడ్‌లో ఇలాంటి సినిమా రావడం కాదు కదా.. అసలు ఇలాంటి కథ రాయాలంటే ఎలాంటి ఆలోచనలు చేయాలిరా బాబు అనుకునే డైలమాలో పడిపోయింది హింది సినిమా ఇండస్ట్రీ..!

కరుడు కట్టిన.. కట్టర్ బాలీవుడ్ నిర్మాత అయిన కరణ్ జోహార్ సైతం.. బాలీవుడ్‌లో ఏం లేదు.. సబ్ కుచ్ సౌత్ సినిమా హై అంటూ రాజమౌళి వెంట పడ్డాడు. కాఫీ విత్ కరణ్ ప్లీజ్ అంటూ రాజమౌళికి కన్నుకొట్టాడు. ధర్మ ప్రొడక్షన్‌లో దమ్మున్న సినిమాలు పడాలంటే… సౌత్ సినిమాలనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఒకప్పుడు స్టాక్ మార్కెట్‌కు హర్షత్ మెహతా ఎలాగో.. ఇప్పుడు బాలీవుడ్‌కు కరణ్ జోహార్ అలాగే..! అలాంటి కరణ్ కారణం లేకుండా తెలుగు సినిమా మీద ఇంత ప్రేమ ఓలకబోయడన్న సత్యాన్ని గ్రహించిన బాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు… కాసుల కోసం ఖాన్‌లను పక్కన పెట్టి.. సౌత్ సినిమాలకు బాలీవుడ్‌లో రెడ్ కార్పెట్ పరిచారు.

2015లో వచ్చిన ఒక్క బాహుబలి ది బిగినింగ్ సినిమాతోనే సతమతమవుతున్న బాలీవుడ్‌కు.. 2017లో వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా చావుదెబ్బకొట్టింది. అప్పటి వరకు దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకే అర్థమైన తెలుగు సినిమా స్టామినా.. అక్కడి ఆడియన్స్‌‌కు కూడా ఎక్కేసింది.

బాహుబలి2లో జక్కన్న చెక్కిన ఒక్కో సన్నివేశం.. ఇకముందు బాలీవుడ్‌లో ఏ దర్శకుడు తీయలేడని హిందీ జనాలను ఫిక్స్ అయ్యేలా చేసింది. అంతే ఎగ్జిబిటర్లు కూడా థియేటర్లకు జనాలు రావాలంటే సౌత్ సినిమా వల్లే సాధ్యమని ప్రొడ్యూసర్ల మీద ఒత్తిడి తేవడం ప్రారంభించారు. రిలీజ్ అయిన రెండ్రోజుల తర్వాత ఏనాడు హౌజ్ ఫుల్ కాని హిందీ బెల్ట్ థీయేటర్లు.. బాహుబలి సినిమాతో కొత్త ఊపిరిపోసుకున్నాయి.

తెలుగు సినిమా వంద కోట్లు దాటడమే గగనమనుకునే స్థితి నుంచి…  తెలుగు సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను దాటిసి దేశచరిత్రలో కనీవినీ ఎరగని కలెక్షన్ల తో .. సంచలనం సృష్టించింది. బాహుబలి 2 సినిమా తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రాన నిలబెట్టి… మరో పదేళ్లు ఈ కలెక్షన్లు ఎవరికీ సాధ్యం కాదని.. ట్రై చేసినా వేస్ట్ అన్న అభిప్రాయానికి వచ్చేలా చేసింది.

ఏకంగా దేశ ప్రధాని సైతం ఎన్నికల ప్రచారంలో బాహుబలి అన్న పదాన్ని వాడేలా చేసిందంటే బాహుబలి ఏ స్థాయిలో బాలీవుడ్‌ను ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇండయన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే స్థితి నుంచి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న స్థాయిలో బాహుబలిని తీసి చూపించారు జక్కన్న.

సర్లే ఒక్క జక్కన్నేగా ఎప్పుడో అయిదేళ్లకు ఓ సారి సినిమా తీస్తాడు అని బాలీవుడ్ అనుకుంటున్న సమయంలో వచ్చాడు… కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దెబ్బతో మరోసారి బాలీవుడ్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనబడేలా చేశాడు.

NOTE…. గతంలో కూడా బాలీవుడ్ లో తమ ప్రతిభను చాటుకున్న దర్శకులున్నారు .. వారి గురించి మరోసారి తెలుసుకుందాం..  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!