త్వరలో యాదగిరిగుట్టకు M M T S ట్రైన్లు !!

Sharing is Caring...

Will the devotee’s dream come true?

యాదగిరి గుట్ట కు రైలులో ప్రయాణించే రోజులు త్వరలో రాబోతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతి రోజూ వేల మంది భక్తులు దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచి కూడా రోజూ అయిదారు వేలమంది భక్తులు యాదగిరి గుట్ట కు వెళుతుంటారు.

ప్రస్తుతం భక్తులు ప్రైవేటు వాహనాల్లో, ఆర్టీసీ బస్సుల్లో యాదగిరి గుట్టకు వెళుతున్నారు. హైదరాబాద్ సిటీ లో ఉండే ట్రాఫిక్ కారణంగా ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.రెండు,రెండున్నర గంటల ప్రయాణానికి ఐదు గంటల సమయం పడుతోంది.  

బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లాలంటే ఛార్జీలు కూడా ఎక్కువగానే వసూలు చేస్తారు. భక్తులకు అలాంటి ఇబ్బంది లేకుండా  సౌత్ సెంట్రల్ రైల్వే యాదగిరి గుట్ట కు M M T S  రైలు నడిపే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎంటీఎస్ రెండోదశ పనులు జరుగుతున్నాయి. MMTS ట్రైన్లు యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని ఎనిమిదేళ్ల క్రితమే నిర్ణయించారు.

ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్కేసర్ వరకు M M T Sట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయవలసి ఉంది.టెండర్ ప్రక్రియ ఆలస్యం అయినందున ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.

తాజాగా.. డీపీఆర్ సిద్ధమవుతున్నది.అన్నీ సజావుగా జరిగితే రెండేళ్ల లోపే M M T S రైళ్ళు యాదగిరిగుట్ట కు నడుస్తాయి. ఈ రైళ్లు మొదలైతే కేవలం రూ.20 ఛార్జీతో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి యాదగిరిగుట్టకు ఈజీగా చేరుకోవచ్చు.ప్రయాణ సమయం తగ్గుతుంది.   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!