ఠాక్రే కి షాక్ .. రెబెల్ క్యాంప్ లోకి ఎంపీలు కూడా ?

Sharing is Caring...

Maha Political Crisis………………………   

శివసేన పార్టీ మొత్తాన్ని ఏక్ నాథ్ షిండే తన గుప్పెట్లోకి లాగేసుకునే సూచనలు కనబడుతున్నాయి. పార్టీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ కి మద్దతు పలుకుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి కార్పొరేటర్లను కూడా వదలడం లేదని అంటున్నారు.

నిజంగా అదే జరిగితే … అది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. పార్టీలో ఏం జరుగుతుందో పసిగట్ట లేకపోయిన ఠాక్రే..ఇపుడు  డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నాలు చేస్తున్నారు. దూతల ద్వారా రెబెల్స్ ను వెనక్కి రప్పించే యత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు ఠాక్రే దారికి వచ్చే సూచనలు కనిపించట్లేదు.

పైగా కొందరు ఎంపీలు సైతం రెబల్ బాట పట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శివసేనకు చెందిన 19 మంది లోక్ సభ ఎంపీల్లో 14 మంది రెబల్ క్యాంప్ కి మద్దతు ప్రకటించినట్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఉద్ధవ్ ఠాక్రే ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ క్యాంప్ కి మద్దతునిస్తున్న శివసేన ఎంపీల్లో రాజన్ విచారే (థానే లోకసభ), భావన గాలి (వషీం), కృపాల్ తుమానే ( రామ్ టెక్), శ్రీకాంత్ షిండే (కల్యాణ్),రాజేంద్ర గవిత్ (పాల్ఫర్ ) తదితరులు ఉన్నట్లు చెబుతున్నారు.

వీరిలో రాజన్ విచారే, శ్రీకాంత్ షిండే  గౌహతిలో రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ కృపాల్ తుమానే తాను రెబల్ క్యాంపులో చేరినట్లు వచ్చిన వార్తలను ఖండించారు.  తాను ఇప్పటికీ శివసేనతోనే ఉన్నానని ఆయన ప్రకటించారు. 

ఎంపీలే కాదు కార్పోరేటర్లను కూడా  ఏక్ నాథ్ షిండే తన కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 400 మంది పాత,ప్రస్తుత కార్పోరేటర్లతో ఏక్ నాథ్ షిండే టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద శివసేనను కింది స్థాయి నుంచి పెకిలించేందుకు గట్టి వ్యూహన్ని షిండే అమలు చేస్తున్నారు. దీంతో శివసేన అధినాయకత్వం అప్రమత్తమైంది. వెంటనే జిల్లా స్థాయిల్లో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. కార్పోరేటర్లు పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం ఏక్ నాథ్ షిండేకి దాదాపు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. నిబంధనల ప్రకారం పార్టీలో మూడింట రెండో వంతు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఏక్ నాథ్ షిండే బీజేపీతో కలుస్తారా లేక కొత్త పార్టీ పెడతారా అనేది సస్పెన్స్ గా మారింది. 

ఇదిలా ఉంటే రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. రాడిసన్ బ్లూఫైవ్ స్టార్ హోటల్లో 7 రోజులకు గాను 70 రూమ్ లను బుక్ చేసారని సమాచారం. 7 రోజులకు వీటి ఖర్చు రూ. 56 లక్షలు కాగా, వీటికి అదనంగా ఆహారం, ఇతర సర్వీసెస్ కలుపుకొని ఒక్క రోజుకు రూ. 8 లక్షల చొప్పున ఖర్చు అవుతుందని అంటున్నారు.

రాడిసన్ బ్లూ సూటల్లో మొత్తం 196 గదులు ఉన్నాయి.రెబల్ ఎమ్మెల్యేల కోసం బుక్ చేసిన 70 గదులు పోగా.. ఇంతకుముందే బుక్ అయిన రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే, వీటిని మినహాయించి కొత్తగా రూమ్ బుకింగ్ సౌకర్యాన్నియాజమాన్యం నిలిపి వేసింది. హోటల్లో బస చేసే వారికి మినహా బయటి వారికి రెస్టారెంట్ లోకి అనుమతి లేదు. ఎమ్మెల్యేలకు ఏది కావాలంటే అది సప్లై చేస్తున్నారు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!