తండ్రిని కాల్చి పడేసింది !!

Sharing is Caring...

“ఎక్కడున్నావ్ “అడిగిందామె. “బార్ లో ఉన్నా” చెప్పాడతను.”సరే … అరగంటలో వస్తా .. ఆ దగ్గరలోని రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం” అందామె. అతగాడు ఈలోగా మరి కొంత తాగాడు. ఆమె చెప్పిన టైమ్ కే  వచ్చింది. ఇద్దరూ కలసి దగ్గరలోని రెస్టారెంట్ కెళ్ళారు. ఆమె ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. అతగాడు పెద్దగా తినలేదు . ఆమె కొంచెం తిన్నది.

“తర్వాత”అన్నాడు అతను “చాద్ పాల్ ఘాట్ కెళుతున్నాం” అందామె.”ఈటైం లో అక్కడి కెందుకు ?”  “అక్కడ ఈటైంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది”. కారు ఘాట్ దగ్గరకు వచ్చింది.  ఘాట్ వెనుక వైపుకు మళ్లించింది కారును. అక్కడ కొంచెం చీకటిగా ఉంది. కారు దిగారు ఇద్దరూ.కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే అతగాడు తూలుతున్నాడు. అక్కడ ఒక బల్ల కనిపించింది. దాని పైన కూర్చున్నారు. “అయితే నువ్వు మళ్ళీ సురేష్ దగ్గరికి వెళ్ళవా ?”అడిగేడు అతను సిగరెట్ వెలిగించుకుంటూ. 

 “ఒకసారి వద్దనుకుంటే .. మళ్ళీ ఎందుకు ?” విసురుగా అందామె. చల్లటి గాలి వీస్తున్నది. అతగాడు ఏదో గొణుగుతూనే ఆ బల్ల మీదకు జారిపోయాడు. ఆమె అటు ఇటు చూసింది. జన సంచారం లేదు. అతగాడిని కిందకు నెట్టింది. నేలపై పడిపోయాడు అతను. చప్పున లేచి వెళ్లి కార్లో దాచిన పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి అతగాడిపై వంపేసింది.నోట్లో కర్చీఫ్ పెట్టింది. బాగా తాగిన మైకంలో ఉన్న అతగాడికి ఏమి జరుగుతుందో తెలీలేదు.అయిదు నిమిషాల్లో అతగాడు అగ్నికి ఆహుతయ్యాడు. “బాస్టర్డ్ .. చావు .. నీకు ఇదే తగిన శిక్ష “అనుకుందామె.  అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.

రెండురోజులు గడిచాయి. మూడోరోజు పొద్దునే పోలీసులు ఆమె ఇంటికొచ్చారు. ఆమెకు ఏమి జరగబోతుందో అర్ధమైంది.ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది అనుకుంది మనసులో. పోలీసులు  స్టేషన్ కు తీసుకెళ్లారు. విచారణ మొదలైంది.సీఐ ఆమె ను చూసి ఆశ్చర్య పోయాడు. చాలా మోడరన్గా ఉంది. వయసు 22 ఉండొచ్చు.  “అతగాడు నీకు ఏమౌతాడు ” సీఐ అడిగాడు.

“నా తండ్రే “.. చెప్పిందామె. ఆ జవాబుకి సీఐ ఆశ్చర్యపోయాడు. అతగాడు వేరేలా ఊహించుకున్నాడు.”ఎందుకలా దారుణంగా చంపావు.” మరో ప్రశ్నవేసాడు.  ఆమె మాట్లాడలేదు. మళ్ళీ అడిగాడు. “చచ్చాక కాల్చాలి.. కానీ బతికుండగానే కాల్చేసాను”  “ఆస్తి కోసమా ?” ” కాదు” అందామె.  

“మరి ?”  “సెక్సువల్ అబ్యూజ్ ..అందుకే చంపేశా.” “అందుకని చంపుతారా ?”అన్నాడు సీఐ కోపంగా. “రోజు తాగొచ్చి రేప్ చేస్తుంటే ..చంపకుండా ఏమి చేయాలి ?”అందామె. సీఐకి కథ అర్ధమైంది. ‘సారీ ‘ అన్నాడు అతను. “పెళ్ళికి ముందు అలాగే చేసేవాడు … భర్తనుంచి విడిపోయి వచ్చాక అలాగే చేసాడు. తల్లి లేదు .ఇంట్లో ఒక్కదాన్నే. చెబితే వినిపించుకోవడం లేదు. వేరే దారి లేక ”  అందామె కన్నీళ్లు పెట్టుకుంటూ. సీఐకి ఏమి మాట్లాడాలో అర్ధంకాలేదు.  ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. ఒక నిమిషం తర్వాత అన్నాడు చిన్నగా.

“ఆ రాత్రి .. నువ్వు ఒక కిలోమీటర్ ముందు కెళ్ళి ఉంటే బాగుండేది. అక్కడ సీసీ టీవీ కెమెరాలు  ల్లేవు.. బ్యాడ్ లక్ “.  తర్వాత ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.   

(ఇది నిజంగా జరిగిన కథే. )

—————KNM   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!