పైకి చెప్పరు కానీ .. లక్షల్లో అభిమానులున్నారు!

Sharing is Caring...

Amused star ………………………………….

ఈ తరం ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి అంతగా తెలియక పోవచ్చు.  కానీ  ముందు తరం వాళ్లకు ఆమె ఒక శృంగార రసాధిదేవత  అంటే అతి శయోక్తి కాదు.బయటపడి చెప్పుకోరు గానీ ఆమెకు చాలామంది అభిమానులున్నారు. 

తన మత్తు కళ్ళతో కవ్విస్తూ, మత్తుగా గమ్మత్తుగా నవ్వుతూ ఎందరో అభిమానుల గుండెల్లో స్మిత కొలువుదీరింది .”బావలు సయ్యా … మరదలు సయ్యా, రింబోలా .. రింబోలా” అంటూ సిల్క్ నర్తిస్తుంటే థియేటర్లో  అభిమానులు చిందులేసేవారు.కేవలం సిల్క్ స్మిత డ్యాన్సులు కోసం సినిమాకు వెళ్ళినవాళ్ళు లేకపోలేదు.

జ్యోతిలక్ష్మి,తర్వాత అత్యంత ఆదరణ పొందిన డ్యాన్సర్ స్మితే. సిల్క్ రాకతో  చాలామంది డాన్సర్లు వెనుక బడ్డారు.గోదావరి జిల్లాలో  పుట్టిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. చిత్రసీమలో అడుగుపెట్టడానికి ముందు ఎన్నో కష్టాలు అనుభవించింది.  ఆమె తండ్రికి ఇద్దరు భార్యలు. ఈమె మొదటి భార్య కూతురు.

నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.సినిమాల్లో హీరోయిన్ కావాలనే కోరికతో చెన్నైచేరింది . కానీ అవకాశాలు ఏమీ దొరకలేదు.ఒకతని సహాయంతో మేకప్ ఉమెన్‌గా రంగ ప్రవేశం చేసింది. బి గ్రేడ్ నటులకు  మేకప్ చేసేది. అపుడే చిన్న చిన్న పాత్రల్లో నటించింది.అదే సమయంలో ఆమె ఓ మలయాళీ సినిమాలో బార్ గర్ల్ పాత్ర చేసింది .

ఆ తర్వాత వండి చక్రం అనే  సినిమాలో నటించింది.  ఆ తమిళ సినిమాలో ఆమె పాత్ర పేరు సిల్క్.. ఆ సినిమా డైరెక్టర్ విను చక్రవర్తి ఆమె పేరును సిల్క్ స్మిత గా మార్చేశాడు.అదే ఆమె పేరు గా స్థిరపడింది. దాంతో  ఆమె కెరీర్ కూడా మలుపు తిరిగింది. పేరు మార్చుకున్న తరువాత వెనుదిరిగి చూడలేదు .ప్రేక్షకులను తన అందచందాలతో, నృత్యాలతో అలరించింది.

తమిళ, తెలుగు ,మలయాళ ,కన్నడ ,హిందీ భాషల్లో దాదాపు 450 సినిమాలలో నర్తించింది.ఆ రోజుల్లో ఎందరో శృంగార తారలు ఉన్నప్పటికీ తనదైన శైలిలో ప్రేక్షకులను సిల్క్ఉర్రూతలూగించింది.ఒక దశలో సిల్క్ సాంగ్ లేని సినిమాను బయ్యర్లు కొనే వారు కాదు. దీంతో నిర్మాతలు తమ సినిమాల్లో తప్పనిసరిగా ఆమె తో ఒక పాట పెట్టె వారు.

కేవలం శృంగార  తారగానే కాకుండా సీతాకోక చిలక అభిమన్యుడు వంటి చిత్రాల్లో కేరెక్టర్ రోల్స్ లోనూ నటించి మెప్పించింది.36 ఏళ్ళ చిన్న వయసులో  సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకున్నది . ఎందుకు అలా చేసింది అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు. చనిపోయే కొద్దీ రోజుల ముందే ఆమె మానసికంగా కృంగిపోయందని అంటారు.

ఒక డాక్టర్ తో సహజీవనం చేసిందని ,.సంపాదించిన సొమ్ము అంతా అతగాడికి ఇచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది. అతగాడు మోసం చేయడంతో ….  ఆత్మహత్యకు పాల్పడిందని  అప్పట్లో పరిశ్రమలో చెప్పుకున్నారు.

కొన్ని సినిమాలు తీసి నష్టం రావడం తో అప్పులు పాలైందని కూడా అంటారు. నమ్మిన వాళ్ళు సమయానికి ఆదుకోక పోవడంతో డిప్రెషన్ కి గురై ఆత్మహత్యకు పాల్పడింది అంటారు. సిల్క్ మరణం ఈనాటికీ మిస్టరీయే.సిల్క్ స్మిత తర్వాత కొందరు తారలు శృంగార పాత్రలు పోషించినప్పటికీ సిల్క్ స్థాయికి చేరుకోలేకపోయారు.

ఇక సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’  సంచలన విజయం సాధించిన విషయం తెల్సిందే.  2013 లో సిల్క్ సక్కట్ హాట్  పేరిట కన్నడంలో కూడా తీశారు. ఇందులో నటి వీణామాలిక్ నటించారు.  వీణా అభినయనానికి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మలయాళం లో క్లైమాక్స్ పేరిట తీసిన సినిమా కూడా సిల్క్ కథ ఆధారంగా తీసిందే . 

———–  KNMURTHY
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!