బాల్యంలో నీనా కు లైంగిక వేధింపులు !

Sharing is Caring...

Child Abuse …………………………………………..

బాల్యంలో లైంగిక వేధింపులను చాలామంది ఎదుర్కొని ఉంటారు. చిన్నతనంలో ఏది గుడ్ టచ్ … ఏది  బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తెలీదు. కొంతమంది తెలిసినా బ్యాడ్ టచ్ చేసినవారిని అడ్డుకోలేరు. ఆ విషయాన్ని కూడా బయటికి చెప్పరు. తమలో తాము కుమిలి పోతుంటారు .. భయపడిపోతుంటారు. చెబితే పెద్దలు ఎలా స్పందిస్తారో అని మధన పడుతుంటారు.

అందుకే తల్లులు తప్పనిసరిగా పిల్లలను పరిశీలిస్తుండాలి. వాళ్ళ మూడ్ ఎలా  ఉంది ? హుషారుగా ఉంటున్నారా ? రోజుల తరబడి డల్ గా ఉంటున్నారా అని గమనించాలి. పిల్లలకు బాడ్ టచ్ గురించి తప్పనిసరిగా వివరించాలి.  ఇలాంటి వేధింపులకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. 

చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని బాలీవుడ్‌ నటి నీనా గుప్తా తన ఆటో  బయోగ్రఫీలో  రాసుకున్నారు. ఆ మధ్య ‘సచ్ కహు తో’ అనే పేరుతో నీనా గుప్తా ఆటో బయోగ్రఫీ విడుదల అయింది.అందులో నీనా గుప్తా ఎన్నో వ్యక్తిగత, వృత్తిగత అంశాల గురించి ప్రస్తావించింది.

“బాల్యంలో  ఓ డాక్టర్, ఓ టైలర్ తనను లైంగికంగా ఎలా వేధించారో నీనా అందులో రాసుకొచ్చింది. ‘ ఒక సారి నా సోదరుడితో కలిసి కళ్ల ఇన్‌ఫెక్షన్‌కు ట్రిట్‌మెంట్‌ కోసం ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అతను నాసోదరుడిని బయట వెయిట్ చేయమని చెప్పి .. వేరే గదిలో నా కళ్లను చెక్‌ చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూనే నా ప్రయివేట్ పార్ట్శ్ పై  చేయివేసాడు.  ఒక్కసారిగా భయం వేసింది. ఇంటికొచ్చి ఎవరికీ తెలియకుండా ఏడ్చాను.

మరో సారి బట్టలు కుట్టించుకోవడానికి ఒక టైలర్‌ వద్దకు వెళ్ళాం. అక్కడ కూడా అలాగే జరిగింది. ఈ రెండు ఘటనల గురించి  అమ్మకు చెప్పలేదు. అదే నేను చేసిన తప్పు ..ఎందుకంటే నన్నే తప్పు పడుతుందనే భయంతో. పిల్లలు ఇలాంటి విషయాలను ఖచ్చితంగా తల్లికి చెప్పాలి. పెద్దలు కూడా పిల్లలు చెప్పేవిషయాలను ఓపికగా వినాలి.” అంటూ తన అనుభవాలను వివరించారు నీనా గుప్తా.  

ఈ పుస్తకం ఐదు భాగాలుగా విభజించబడింది.  దీనిలో ఆమె జీవిత కథ కాలక్రమానుసారం సాగుతుంది. పార్ట్ వన్ ‘ఢిల్లీ గర్ల్’ ఢిల్లీ లోని తన చిన్ననాటి రోజులు. రెండవ భాగం ‘బొంబాయి గర్ల్’ మహానగరంలో కేరీర్ ..బిగినింగ్ రోజుల్లో పోరాటం గురించి; మూడవ భాగం ‘ది ప్రిన్సెస్ అరైవ్స్’ కుమార్తె  మసాబాకు సింగిల్ పేరెంట్‌గా మారాలని నిర్ణయించుకున్నప్పుడు జీవితం ఎలా మారిపోయిందనే విషయాలు ..పార్ట్ నాలుగు ‘మ్యాడ్ టైమ్స్’  ఆమె కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడం గురించి .. చివరి భాగం ‘నలుగురు గుప్తాలు ..  ఒక మెహ్రా ‘ నీనా తన కుటుంబ సభ్యులకు ఒక్కొక్క అధ్యాయాన్ని అంకితం చేసింది.Penguin Ebury Press వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!