ఈ కంపెనీ షేర్లను అమ్ముకోవచ్చు !

Sharing is Caring...

The work pattern is sluggish……………………………

భారత్ ఫోర్జ్ కంపెనీ పనితీరు ప్రస్తుతం కొంచెం మందకొడిగా సాగుతోంది. సంస్థ ఆటోమోటివ్‌, పవర్, ఆయిల్, గ్యాస్, కన్‌స్ట్రక్షన్, మైనింగ్, లోకోమోటివ్, మెరైన్,ఏరోస్పేస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పూణే లో కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బహుళజాతి సంస్థషేర్లు జూన్ 9 న రూ. 756 వద్ద కదలాడగా … జులై 13న రూ. 820 వద్ద ట్రేడ్ అయ్యాయి.

సెప్టెంబర్ లో షేర్ ధర మళ్ళీ తగ్గింది. నవంబర్ లో కొన్ని రోజులు 800 వద్ద ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. తర్వాత డిసెంబర్ లో ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 724 వద్ద ట్రేడ్ అవుతోంది.కంపెనీ అమ్మకాలు కొంత బలహీనంగా ఉన్నకారణంగా షేర్ ధర ముందుకు కదలడం లేదు. ఒత్తడి ఎదుర్కొంటున్నది.

ట్రక్ సెగ్మెంట్‌, ప్యాసింజర్ వెహికల్స్ సిగ్మెంట్ అమ్మకాలలో ఒడిదుడుకులు,ముడి చమురు ధరల్లో తగ్గుదల వంటి కారణాలు  షేర్  ధరపై ప్రభావం చూపుతున్నాయి. ఉత్తర అమెరికా మార్కెట్‌లో భారీ ట్రక్కుల అమ్మకాలు కూడా తగ్గాయి.ఇది కూడా ఒక ప్రతికూలాంశమే. క్లాస్‌-8 ట్రక్కుల ఆర్డర్లు బాగా తగ్గాయి.

అక్టోబర్ తో పోలిస్తే 41 శాతం తగ్గాయి.  ఉత్తర అమెరికా, యూరప్‌లలోని పలు ప్రాంతాల్లో… వచ్చే ఏడాదిలో హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అమ్మకాలు 16 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.పెండింగ్‌ ఆర్డర్ల సంఖ్య తగ్గి .. సరకు రవాణాలో లాభాలు పెరగవచ్చని కంపెనీ భావిస్తోంది.

వచ్చేఏడాది ప్రయాణికుల వాహనాల అమ్మకాలు కూడా పుంజుకుంటాయని అంచనావేస్తున్నారు. అలాగే ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వీటి కారణంగా రాబోయే రోజుల్లో కంపెనీ పనితీరు మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో షేర్ ధర పెద్ద గా పెరగకపోవచ్చని  విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.847 కాగా కనిష్ట ధర రూ.492 మాత్రమే. రూ. 500-600 మధ్యధర ల్లో  కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఈ షేర్లను అమ్మేసి లాభాలు స్వీకరించడం మంచిది. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో పడితే షేర్ ధర మరింత పతనం అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత తరుణంలో ఈ  షేర్లలో ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహం కాదు. ధర బాగా తగ్గినపుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం లాభదాయకం. దీర్ఘ కాలానికి మంచి షేర్ అయినప్పటికీ ప్రస్తుత ధర వద్ద మదుపు చేయడం తెలివైన నిర్ణయం కాదు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!