పుతిన్ వ్యవహార శైలిపై రష్యన్ల ఆగ్రహం !

Sharing is Caring...

పుతిన్ చేస్తోన్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలతో పాటు రష్యా ప్రజల ప‌రిస్థితి మరీ ఘోరంగా త‌యారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆంక్షల విధించి ర‌ష్యాను ఏకాకిని చేశాయి. ఈ నేపథ్యంలో  రష్యాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.  పలు దేశాలు ఆంక్షల పేరుతో ర‌ష్యాకు ఎగుమ‌తుల‌ను నిలిపివేసాయి. దీంతో నిత్యావసర సరకుల కొర‌త ఏర్పడింది. దీంతో ప్రజలు తమ దేశ అధినేత పుతిన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోస్తున్నారు.

రష్యాలో వార్షిక ద్రవ్యోల్బణం 2015 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేగాక కొన్ని నిత్యావసరాల కొరత కారణంగా రష్యాలోని షాపులు కస్టమర్లకు పరిమితులు విధించి సరకులను అందిస్తున్నాయి. తాజాగా ఓ సూప‌ర్ మార్కెట్‌లో చక్కెర కోసం ర‌ష్య‌న్లు పోట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

ఒక‌రి ద‌గ్గ‌ర ఉన్న చక్కెర  ప్యాకెట్ల‌ను మ‌రొక‌రు లాక్కుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.  దీన్ని బట్టి రష్యా కూడా ఎంతటి దురవస్థలో పడిందో అర్థమౌతోంది. ఇప్పటికైనా ఉక్రెయిన్‌ పై యుద్ధం వ్యవహారం ఓ కొలిక్కి రాకపోతే రష్యా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉ‍న్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ యుద్ధం వలన ఉక్రెయిన్ నష్టపోతున్నది కానీ అదే సమయంలో రష్యన్లు కూడా నష్టపోతున్నారు. పుతిన్ ఈ విషయాన్నీ విస్మరిస్తున్నారు . తన కుటుంబాన్ని పిల్లలను ,ప్రియురాలిని భద్రంగా దాచిన పుతిన్ ప్రజల క్షేమాన్ని మరచిపోయారు.

యుద్ధం నాలుగు వారాలుగా కొనసాగుతుండడంతో.. రష్యా ఆయుధగారాలు నిండుకుంటున్నాయని, సైనికులు అలసిపోతున్నారని అంటున్నారు.  తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా యుద్ధం ముగింపుకు పుతిన్ భిన్న మార్గాలను అన్వేషిస్తున్నారని అంటున్నప్పటికీ ఆ ప్రయత్నాలు నిజాయితీగా జరగడం లేదు. లక్షలమంది ఉక్రెయిన్ పౌరుల ను పుతిన్ దాడుల పేరిట హింస కు గురిచేస్తున్నారు.

1940ల్లో బలప్రయోగం ద్వారా ఫిన్లాండ్‌ను తన ప్రావిన్స్‌గా మార్చుకునేందుకు ఆ నాటి సోవియట్‌ యూనియన్‌ నేత జోసెఫ్‌ స్టాలిన్‌ ప్రయత్నం చేశారు. ఫిన్లాండ్‌వాసులు అప్పట్లో పెట్రోలు బాంబులు వంటి ఆయుధాలతో సోవియట్‌ సేనను అడ్డుకున్నారు. దీంతో స్టాలిన్‌ బలగాలు వెనుదిరిగాయి. నాటి పరిణామాన్ని.. పుతిన్‌ నేడు సాగిస్తున్న యుద్ధంతో విశ్లేషకులు పోల్చి చూస్తున్నారు.

కానీ ఇక్కడ పుతిన్ వెనుదిరగలేదు. మొండిగా దాడులు చేయిస్తూ యుద్ధ నేరస్తుల జాబితాలో కెక్కారు.
అమెరికా,ఐరోపా దేశాల ఆంక్షలు  రష్యాపై  పై గట్టి ప్రభావాన్నే చూపాయి. ప్రజల సహనాన్ని పుతిన్ పరీక్షిస్తున్నారు.పుతిన్ తీరు మార్చుకోకపోతే రష్యన్లే తిరుగుబాటు చేసినా ఆశ్చర్యం లేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!