ఆసియా సంపన్న మహిళ !

Sharing is Caring...

SAVITRI JINDAL …………………………..

ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్ కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు. బ్లూమ్ బెర్గ్ బిలియనర్స్ సూచీ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

ఇప్పటివరకు ఈ జాబితాలో చైనాకు చెందిన దిగ్గజ స్థిరాస్తి సంస్థ కంట్రీ గార్డెన్ కో ఛైర్మన్ యాంగ్ హుయాన్ తొలి స్థానంలో కొనసాగారు. అయితే చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ఎఫెక్ట్ తో ఏడాది కాలంలోనే యాంగ్ సంపద సగానికి పైగా కరిగిపోయింది.

ఈ ఏడాది జనవరిలో యాంగ్ సంపద విలువ 23.7 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ఆసియా సంపన్న మహిళ ర్యాంకును  ఆమె కోల్పోవడమే గాక, ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు.

11.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో సావిత్రి జిందాల్ ఆసియా సంపన్న మహిళగా అగ్ర స్థానంలోకి చేరారు.  చైనాకు చెందిన మరో బిజినెస్ టైకూన్ ఫాన్ హాంగ్ వియ్ రెండో స్థానంలో ఉన్నారు.హెంగ్లీ పెట్రోకెమికల్‌కు ఈమె చైర్మన్. కంపెనీ 2002లో స్థాపితమైంది.  చైనాలోని పలు నగరాల్లో ఈ కంపెనీ కర్మాగారాలున్నాయి. ఆమె భర్త చెన్ జియాన్హువా కూడా బిలియనీర్.

72 ఏళ్ల సావిత్రి జిందాల్.. భారత్ లోనే అత్యంత ధనిక మహిళ. దేశంలోని మొత్తం సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. 2005లో జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు, సావిత్రి భర్త ఓపీ జిందాల్ విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత సంస్థ బాధ్యతలను సావిత్రి అందుకున్నారు.

ఈ కంపెనీ దేశంలో మూడో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. స్టీల్ తో పాటు సిమెంట్, ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో, ఆమె తర్వాత కిరణ్ మజుందార్, కృష్ణ గోద్రెజ్ తదితరులున్నారు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!