అక్కడ…రాక్షస రతిక్రీడలు జరుగుతుంటాయి. కరెన్సీ నోట్ల మధ్య శరీరాలు నలుగుతుంటాయి.పువ్వుల్లా అమ్మాయిలు వాడిపోతుంటారు. సాలెగూడులాంటి గదుల్లో వారి బతుకులు తెల్లవారుతుంటాయి. మనసుకు గాయాలైనా శరీరం పరాధీనం చేయాల్సిందే. వారిది కడుపు నింపుకునే ప్రయత్నం… పడుపు వృత్తి ఓ మార్గం.
నయవంచకుల చేతికి చిక్కి అంగడి బొమ్మల్లా అమ్ముడు పోతున్నారు. వేశ్యా వాటికలలో చిక్కుకుని మగ్గి పోతున్నారు. ఇలాంటి వేశ్యా వాటికలు పూణే, ముంబాయి, డిల్లీ లాంటి నగరాల్లో పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లేకపోలేదు. కాకపోతే ఇక్కడ ఓ మాదిరి స్థాయిలోనే వేశ్యా వాటికలు నడుస్తున్నాయి.
ముంబయి కామాఠిపురా లో వీధులకు వీధులే వ్యభిచార కేంద్రాలు. మార్కెట్లో పూలు,పండ్లు, వస్త్ర దుకాణాల షోకేస్లలో బొమ్మల్లాగా… వీధిలో తెల్లవారింది మొదలు, అర్ధరాత్రిదాకా ‘అమ్మాయిలు’ నిలువు కాళ్లపై బేరాలకోసం ఎదురు చూస్తుంటారు. చూపులతో కవ్వించేవారు, మాటలతో రెచ్చగొట్టే వారూ తారస పడతారు.
పండ్లు కొన్నంత ఈజీగా, బహిరంగంగా రోడ్లపైనే అక్కడ బేరసారాలు సాగుతుంటాయి. నిజానికి అక్కడో మినీ భారతం కనిపిస్తుంది. తమిళనాడు నుంచి కాశ్మీర్దాకా… ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలైనా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు చెందిన వారు వేల సంఖ్యలో అన్నిచోట్లా ఉంటారు. వీరంతా వ్యభిచారంలో మగ్గి పోతున్నారు.
ఈ వేశ్యా వాటికల స్థాయి ఎలా ఉన్నా అందులోకి చేరే వారు కొందరు దారి తప్పి వచ్చేవారు … దారి తప్పించగా వచ్చేవారు…ఇంకొందరు మోసపోయో,ప్రలోభానికి గురయ్యో, అపహరణకు గురై కానీ ఈ వాటికలకు చేరుతుంటారు. మరికొందరు యువతులు మోసగాళ్లు విసిరే ప్రేమవలలో పడి అమ్ముడవుతున్నారు.
ఒక్కో యువతి ధర రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. 18 ఏళ్లలోపు చిన్న పిల్లలకు డిమాండ్ ఎక్కువ. మోసగాళ్ళ ఉచ్చులో చిక్కిన అమాయక యువతులు వేశ్యలుగా మారుతున్నారు. నిజంగా ఒక్కొక్కరిది ఒక్కో బాధ.గాథ. లోతుకెళ్ళిచూస్తే మరోప్రపంచం కన్పిస్తుంది . కొందరికి వ్యభిచారం తప్పు కాదు.తండ్రి కూతురిని, భర్త భార్యను, తల్లి పిల్లలను, అక్కలు,చెల్లెళ్ళను వేశ్యా వాటికలకు అమ్మేసిన ఉదంతాలు కూడా కోకొల్లలు.
అందుకు కారణం పేదరికం, డబ్బులేని జబ్బు..కొందరు ఇష్ట పూర్వకం గానే వ్యభిచార వృత్తి లోకి వస్తుంటే మరికొందరు బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి నెట్టబడుతున్నారు. 11 ,12 ఏళ్ళ చిన్నారులు కూడా సెక్స్ వర్కర్స్ గా వున్నారంటే నమ్మ బుద్ధి కాదు.
పాలు గారే పసికూనల పైనే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. అమ్మాయిలను ఒక చోట నుంచి మరో చోటకు తరలిస్తుంటారు. పేదరికాన్ని ఆసరా గా చేసుకొని ఉద్యోగం,ఉపాధి ,పెళ్లి,ప్రేమ, సినిమాల్లో వేషాల పేరిట యుక్త వయసు బాలికలను వ్యభిచారం లోకి దించుతున్నారు.
ఇవాళ మన దేశం లో లక్షల సంఖ్యలో సెక్స్ వర్కర్లు వున్నారు.వీరిలో అధిక శాతం దగాపడ్డ వారే.ఆ దగా పడిన అమ్మాయిల వెతలు, వేదనలు,రోదనలు వింటే మనం ఇలాంటి ప్రపంచంలో ఉన్నామా అనిపిస్తుంది. కమలహాసన్ నటించిన ‘మహానది’ లో ఈ వేశ్యావాటికలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు.
——————-KNMURTHY
Murthy garu stori baagundi.kaanee.. ado ekkada jarugutundo rayadam marchipoyaru.
సుబ్బు గారు … మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు ….. దాదాపుగా ప్రతి చోటా జరుగుతోంది. ఒక ప్రాజెక్టు లో భాగంగా సెక్స్ వర్కర్స్ తో నేను కలసి పనిచేసాను . దేశంలోని అన్ని ఏరియాలు తెల్సు. చూసికూడా వచ్చాను.