A school for making politicians……………………
ఈ స్కూల్ లో శిక్షణ ద్వారా భారతీయ రాజకీయాల గమనాన్ని అర్థం చేసుకోవచ్చు.ఎన్నికల ప్రచారం నిర్వహణ… కొత్త పోకడలు, నియోజకవర్గ అభివృద్ధిని అంచనావేయవచ్చు. ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవచ్చు. వివిధ మంత్రిత్వ శాఖల పాత్ర .. వాటి బాధ్యతలను అర్థం చేసుకోవచ్చు.
లోక్‌సభ.. రాజ్యసభ చర్చలు జరిగే తీరు… పార్లమెంటు లేదా అసెంబ్లీలో బిల్లు ముసాయిదాను రూపొందించి సమర్పించే విధానాన్ని తెలుసుకోవచ్చు. బడ్జెట్ తయారీ ప్రక్రియ ఎలాఉంటుందో ? ప్రణాళికా సంఘం పాత్రను ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
యుకె కి లేదా యూరప్ కి ఇంటర్నేషనల్ స్టడీ టూర్ కూడా ఏర్పాటు చేస్తారు.ఈ టూర్ ద్వారా అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహనా పెంచుకోవచ్చు. అంతర్జాతీయ కార్యాలయాల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.
ఈ పర్యటనలో బ్రిటీష్ పార్లమెంట్, కామన్వెల్త్ సెక్రటేరియట్, బ్రిటిష్ లైబ్రరీ, బ్రిటిష్ హిస్టరీ మ్యూజియం లను చూడవచ్చు పార్లమెంటు సభ్యులతో పరస్పర ముఖాముఖీ చర్చలు ఉంటాయి. ఈ చర్చల్లో పాల్గొనేవారు బెల్జియంలోని బ్రస్సెల్స్‌లోని నాటో కార్యాలయాన్ని సందర్శించే అవకాశాన్ని పొందుతారు.
ఆ తర్వాత పారిస్, హేగ్‌లోని యునెస్కో కార్యాలయాలు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్ పార్లమెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ కార్యాలయాలను సందర్శించవచ్చు. GHRD .. OPCW వంటి అంతర్జాతీయ సామాజిక సంస్థలు. రాయబార కార్యాలయాలను చూడవచ్చు.
ఈ స్కూల్ కి ఎల్కే అద్వానీ,సుబ్రమణ్యస్వామి , ఉమాభారతి,సుమిత్రా మహాజన్,సుశీల్ కుమార్ షిండే, ప్రకాష్ జవదేకర్,వెంకయ్య నాయుడు,మనోహర్ జోషి,ఆస్కార్ ఫెర్నాండేజ్, శ్రీ శ్రీ రవిశంకర్, దిగ్విజయ సింగ్,డీ రాజా,యశ్వంత్ సిన్హా, శ్రీమతి మార్గరెట్ అల్వా,శరద్ పవర్,మనీష్ శిశోడియా,ఆనందినిబెన్ పటేల్ వంటి ప్రముఖులు వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు.
ఈ రాజకీయ పాఠశాలలో రెండేళ్ల పీజీ కోర్సు చేస్తే రాజకీయాలపై చాలావరకు అవగాహన పెరుగుతుంది. భవిష్యత్తు లో రాజకీయ నాయకులుగా మారవచ్చు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఇప్పటికే క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారు .. ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నవారు కూడా ఈ కోర్సులో చేరితే ఉపయోగ కరంగా ఉంటుంది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 50% మార్కులతో పాసయిన ఏ గ్రాడ్యుయేట్ అయినా ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు. చివరి సంవత్సరం గ్రాడ్యుయేషన్ పరీక్షలకు హాజరయ్యే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ టైప్ వ్రాత పరీక్తో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ కోర్సు చదివితే క్రియా శీలక రాజకీయాల్లోనే కాక మరెన్నో అవకాశాలు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు ,పాలసీ రీసెర్చ్ అసోసియేట్,పొలిటికల్ కన్సల్టెంట్లు ,రాజకీయ వ్యూహకర్తలు, నియోజకవర్గ నిర్వాహకులు,.. ఎన్నికల ప్రచార నిర్వాహకులు ,మీడియా విశ్లేషకులు,ఎన్నికల విశ్లేషకులు, పీఆర్వోలు,సోషల్ మీడియా విశ్లేషకులు గా కూడా కెరీర్ మొదలు పెట్టవచ్చు.
ఇటీవల కాలంలో ఇలాంటి ప్రొఫెషనల్స్ కి డిమాండ్ కూడా ఉంది. జీత భత్యాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటాయి. ఇ ప్పటివరకు ఈ స్కూల్ నుంచి 450 మంది విద్యార్థులు పట్టా పుచ్చుకున్నారు. వీరిలో 250 మంది రాజకీయ వ్యూహ కర్తలుగా, రాజకీయ పార్టీల సలహాదారులుగా చేస్తున్నారు.