పురుషాంగం ఆమె జెండా, ఎజెండా! (1)

Sharing is Caring...

Taadi Prakash ………………………………………………………………………..

PENIS IS METAPHOR FOR PROTEST……………………………

చిట్టితల్లి చైత్ర కోసం మరోసారి వేదనతో ..
మనమంతా మంచివాళ్ళం. మర్యాదస్థులం. చిన్నవాటికి, చితకవాటికీ సిగ్గుపడే వాళ్ళం. ఎవరో ఎందుకు, నాకు చాలా సిగ్గు. ఇంకొంచెం మాంసం కూర కావాలి – అని అడగడానిక్కూడా సిగ్గే. నువ్వంటే నాకెంతో ఇష్టం అని చెప్పడానికి సిగ్గుపడి కనకమహాలక్ష్మిని కాలేజీ రోజుల్లోనే కోల్పోయాను.

అస్సలు సిగ్గులేని రావిశాస్త్రి గారు ఒక నవలలో “వెంకట్రావు బాగా సిగ్గరి. భార్య ముందు కూడా బనీను ఇప్పట్ట” అని రాశారు. నా గురించి రావిశాస్త్రికి ముందే ఎలా తెలుసో – అని కొంత గింజుకున్నాను కూడా. మన పెద్దవాళ్ళు కూడా ” సిగ్గు లేదా నీకు ” అని మందలిస్తూ ఉంటారు. ఎక్కడో ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాలని నాలాంటి జర్నలిస్టు గాళ్ళు జాతికి సందేశం ఇస్తుంటారు.

నీ సిగ్గు మొగ్గలైపోనూ.. అనీ, కొండొకచో బొగ్గులైపోనూ అనీ దీవిస్తూ ఉంటారు. దేనికైనా సిగ్గూ శరం ఉండాలనీ అంటారు. శరం అంటే నాకు నిజంగా తెలీదు. శరముల వలెనూ చతురోక్తులనూ చురుకుగ విసిరే నైజములే .. అనే పాట బాగా నచ్చుతుంది. అలాంటి బాణాల్లాంటి మాటలు మెత్తగా గుచ్చుకుంటాయి. సిగ్గు పడటం అనేది మనకి ఒక సంప్రదాయం.విషయం చిన్నదైనా, పెద్దదైనా సిగ్గుపడ్డానికి మనమేమాత్రం సిగ్గు పడం.

ఇంత సిగ్గుపడే ఈ మర్యాదస్తుల సమాజం ఆడదాన్ని తిట్టడానికి, కొట్టడానికి, హింసించడానికి, రేప్ చేయడానికీ అదేంటో.. అస్సలు సిగ్గుపడదు. చంపి, కాల్చిబూడిద చెయ్యడానికీ సంకోచించదు. మేం అనాగరికులం అనీ, ఆటవికులం అనీ రెండు రోజులకొకసారైనా నిరూపించుకోకపోతే మా మగాళ్ళకి అస్సలు నిద్ర పట్టదు. మనది సర్వసత్తాక, సర్వభ్రష్ట , సర్వావలక్షణ భూయిష్టమైన వర్ణనాతీతంగా వెనుకబడిన ఉన్నత సమాజం.

The Problems of a Pathetically Backward Society అనే డీజనరేషన్ మీదొక రీజనబుల్ లెక్చర్ దంచడానిక్కాదు, ఇదంతా.అస్సలు ఏమాత్రమూ మంచీ మర్యాదా, సిగ్గూ శరమూ లేని ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆమె అమెరికన్. బాగా చదువుకున్నావిడ. ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసింది. గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నావిడ. బొమ్మలు వేయడానికి ఆమె సబ్జెక్టు – పురుషాంగం.

చాలా సంవత్సరాలుగా ఆమె పురుషాంగం బొమ్మలు వేస్తూనే ఉంది. ఇప్పటికి ఒక ఐదు వందల phallus paintings వేసింది. రకరకాల పురుషాంగాలు – పెద్దవీ, చిన్నవీ, లేచి ఉన్నవీ, వెంట్రుకలతో ఉన్నవీ, దాడి చేయడానికి అన్నట్టుగా బిర్రబిగుసుకున్నవీ – ఎన్నో మేడ్రాలు! సాధారణంగా ఇలాంటి ఆడవాళ్లని మనలాంటి వేదభూమిలో బరితెగించిన ముండ అంటారు. సిగ్గూ శరం, చీమూ నెత్తురూ లేని బజార్లంజ అంటారు. పడేసి దెంగితే గానీ దీనికి బుద్ధి రాదనీ రాక్షస లైంగిక వాంఛతో రెచ్చిపోతారు. కష్టంగా ఉందా? గజ్జల్లో నొప్పి గా అనిపిస్తోందా? Yes. మీ సున్నితమైన మనోభావాల్ని నేను గాయపరచ దలుచుకున్నాను.

పాలరాతితో కట్టుకున్న మీ పవిత్ర మనో మందిరాల్ని గునపాలతో పొడిచి పొడిచి కూలగొట్ట దలుచుకున్నాను. నడిరోడ్డు మీద మీ ప్యాంట్లు విప్పి, మీ రహస్య అంగాల మీద నల్లని ఇంకు పోయదల్చుకున్నాను. MY NAME IS PROTEST.
TO HELL WITH YOUR DICK అని ‘ నానాయాగీ ‘ చేస్తూ గత 50 సంవత్సరాలుగా పెయింటింగ్ లు వేస్తున్న ఆ అమెరికన్ ఆర్టిస్ట్ పేరు JUDITH BERNSTEIN. ఆమె మారుపేరు మహాస్వప్న!  ఇంటిపేరు జ్వాలాముఖి!! తండ్రి పేరు నగ్నముని!!! మన దిగంబర కవులు తెగించి రాయడమూ, ఆమె అక్కడ PHALLUS పెయింటింగ్ లు వేయడమూ ‘ 60వ దశకం’ లోనే మొదలయింది.

మన ఇస్మత్ చుగ్తాయ్ కీ, కమలాదాస్ కీ నిజమైన వారసురాలు బెర్న్ స్టీన్. 1942 అక్టోబర్ 14న ఆమె న్యూ యార్క్ లో జన్మించింది. ఇప్పుడు ఆమెకి 77 ఏళ్ళు. ఫైర్ బ్రాండ్ ఫెమినిస్ట్ పెయింటర్. PENIS అంటే హజం. దౌర్జన్యం. దురాక్రమణ. స్త్రీ ని బెదిరించి, భయపెట్టడానికి మగాడు వాడే ఆయుధం PHALLUS. అదే ఆమె METAPHOR.

నియంత హిట్లర్ ని చార్లీ చాప్లిన్ హేళన చేసినట్టుగానే ఈమె డోనాల్డ్ ట్రంప్ ని గ్రేట్ DICK’టేటర్ అని పడీపడీ నవ్వుతోంది. ఈమధ్యనే అమెరికాలో ఆమె పురుషాంగాల పుస్తకం విడుదల అయింది. మనకది అమర్యాదకరమూ, షాక్, సంచలనం గానీ అమెరికన్లకి ఆమె బాగా తెలుసు. బెర్న్ స్టీన్ extremist ఫెమినిస్టు. మగ దురహంకారానికి ప్రతీకగా మగవాడి మేడ్రాన్ని వాడింది. ఆమె పుస్తకం పేరు DICKS OF DEATH.

‘ మృత్యు మేఢ్రాలు ‘ అనొచ్చా? మగవాడి బలుపునీ, సెక్స్ అనేది వాడికి Pleasure – ఆడదానికి శిక్ష .. అనుకునే పొగరుబోత్తనాన్ని ఆమె తిప్పికొట్టింది. కళాత్మకమైన బూటు కాళ్లతో ఎగిరి BALLS మీద తన్నింది. JUDITH BERNSTEIN’S LATEST BOOK IS A PINNACLE OF PROTEST.

pl.read it also ………………...పురుషాంగం ఆమె జెండా, ఎజెండా!(2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!