అతను దెయ్యాల వేటగాడా ?

Sharing is Caring...

The Ghost Hunter Tivary………………………………

గౌతమ్ తివారీ కి దెయ్యాల వేట అంటే చాలా ఇష్టం. అయితే అతడే  కొన్నేళ్ల క్రితం అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా ?… ఆత్మహత్య చేసుకున్నాడా?… లేదా దెయ్యాలే చంపేశాయా? అనేది ఇప్పటికీ మిస్టరీ. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో తెలుసుకుందాం;

అదొక అపార్ట్‌మెంటు..5 వ అంతస్తులోని ఒక ఫ్లాట్. అతను తలుపులు తీసాడు. లోపలంతా చిక్కటి చీకటి.  ఏమీ కనిపించడం లేదు. ‘బయటకు వెళ్ళేటపుడు లైట్ ఆర్పకుండానే  వెళ్లానే .. అనుకుంటూ  సెల్ ఫోన్ లోని టార్చ్‌ ని ఆన్ చేశాడు. ఆ వెలుతురు లో స్విచ్‌ ఆన్ చేసాడు. లైట్ వెలిగింది. డోర్ లాక్ చేసి సోఫా లో కూర్చున్నాడు. తెచ్చుకున్న మందు బాటిల్ .. బిర్యానీ పాకెట్  టీ పాయ్ పై పెట్టాడు.

చక్రవర్తి పక్కనే ఉన్న సిటీ లో ఉంటాడు. తక్కువ ధరలో వస్తుందని ఫ్రెండ్స్ చెబితే ఈ మధ్యనే అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. కానీ అందులో ఉండటం లేదు. దీన్నిఅద్దెకివ్వాలని ఉదయమే నగరానికి వచ్చాడు. TOLET బోర్డు పెట్టించాడు. చిన్న చిన్న పనులుంటే బయటికి వెళ్లి వచ్చాడు. మందు రెండుపెగ్గులు తీసుకుని బాత్ రూమ్ కి కెళ్ళి స్నానం చేసి వచ్చాడు.

టీపాయ్ పై ఉన్న బిర్యానీ ప్యాకెట్ విప్పిఉంది. నాలుగైదు మెతుకులు కూడా టీ పాయ్పై పడి  ఉన్నాయి. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది.. ప్యాకెట్ తాను విప్పలేదు .. ఎవరో విప్పి తిన్నట్టు ఉంది.. తలుపులు కూడా వేసి ఉన్నాయి. ఎవరూ రావడానికి అవకాశం లేదు. మొదటి సారిగా అతగాడికి భయమేసింది. ఇక్కడ ఏమైనా దెయ్యాలున్నాయా ? అన్న ఆలోచన కూడా కలిగింది.

మిగిలిన మందు తాగుతూ ఆలోచనలో పడ్డాడు.ఆ మిగిలిన బిర్యాని కూడా తినేసాడు. ఇంతలో నవ్వు వినిపించింది. అది ఆడపిల్ల నవ్వులా ఉంది. బెడ్ రూమ్ లో ఎవరైనా ఉన్నారా ? అటువైపునుంచి నవ్వు మళ్ళీ వినపడింది. చూద్దామని లేచి బెడ్‌రూమ్ తలుపు తీశాడు. లైట్ వేసి లోనికి అడుగుపెడుతుండగానే మళ్ళీనవ్వు వినిపించింది. చక్రవర్తికి భయం పెరిగింది.

లోపల చూస్తే ఎవరూ కనిపించలేదు.మరి నవ్వింది ఎవరు? అనుకున్నంత లోనే మళ్లీ నవ్వు వినిపించింది. అతని వెన్నులో వణుకు మొదలైంది. మంచం కిందకు తొంగి చూసాడు .. అక్కడ ఎవరూ లేరు … అంతలో బాత్ రూమ్ లో నుంచి మూలుగులు వినిపించాయి.మెల్లగా వెళ్లి లైట్ వేసి బాత్రూం డోర్ మెల్లగా తీసాడు. ఎవరూ లేరు.

హమ్మయ్య అనుకుని డోర్ వేసి ఏమిటి ఇదంతా ? భ్రమా ? ఒకసారి అంటే భ్రమ… అనుకోవచ్చు.మనసులో ఏదో డౌట్ కొడుతూనే ఉంది. మంచం మీద పడుకున్నాడు.అలా కళ్ళు మూసుకున్నాడో ? లేదో ? మళ్ళీ నవ్వులు వినిపించాయి.ఈ సారి ఇద్దరి నవ్వులు. ఒక్కసారిగా మంచం కొంచెం పైకి లేచి గుండ్రంగా తిరగడం మొదలెట్టింది.

అంతలోనే ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. ఊడి మీద పడుతుందా ? అని భయమేసింది. చక్రవర్తి వణికిపోయాడు. భయంతో కేకలు వేసాడు. అతడు లేచి కూర్చోగానే మంచం తిరగడం ఆగింది. ఫ్యాన్ కూడా ఆగిపోయింది. ఇదే ఛాన్స్ అని లేచి హాల్లోకి పరుగెత్తాడు.డోర్ తీసి బైటకు వచ్చాడు. 


చక్రవర్తి చెప్పిన పై కథనం అంతా శ్రద్ధగా విన్నాడు గౌరవ్ తివారీ. తివారీ ఇండియాలో తొలి ఘోస్ట్ హంటర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అతను చెప్పినదంతా విని వెంటనే చక్రవర్తితో ఆ ఫ్లాట్‌కి వెళ్ళాడు. లోపలకు అడుగుపెట్టగానే గౌరవ్ కి  అర్ధమైంది. అక్కడ ఏం జరుగుతోందో ? అన్ని గదులు తిరిగాడు. అవును అక్కడ ఒక ఆత్మ ఉంది. అది కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటోంది.

భర్త చేతిలో వంచనకు గురై, హింసల పాలై …చివరికి ప్రాణాలే కోల్పోయిన వేదనతో ఆమె దెయ్యమై అక్కడే తిరుగాడుతోందని గౌరవ్ గ్రహించాడు. చక్రవర్తికి అన్ని వివరించాడు. ఇక్కడ దెయ్యం ఉంది.. కనుక ఈ ఫ్లాట్ ను విడిచి పెట్టమన్నాడు.లేదంటే తనకు సహకరిస్తే .. ఆ దెయ్యాన్నితాను తరిమి కొడతానని చెప్పాడు. గతంలో గౌతమ్ తివారీ ఇలాంటి కేసులు కొన్ని పరిష్కరించాడు. 

   
తరువాయి పార్ట్ 2 లో  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!