కఠారి పుణ్యమూర్తి ………………………………….
Congrats to Dr. Krishna for developing the hiv vaccine …………………….HIV కి వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది కదా అని అనుకోని మనిషి భూప్రపంచంలో ఉండడు… ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారు వ్యాక్సిన్ రూపకల్పనకి… వేగంగా పరివర్తనం చెందే HIV వైరస్ ని నాశనం చెయ్యడానికి వ్యాక్సిన్ కనిపెట్టడం అంత తేలికేమీ కాకపోయినా, శాస్త్రవేత్తలు చాలా కృషి చేస్తున్నారు.
కానీ ఈ పోరాటంలో మార్పు చెందే వైరస్ మాత్రమే కాదు ఇంకో కష్టం కూడా వుంది..అదే వ్యాక్సిన్ తయారీకి అయ్యే ఖర్చు… వ్యాక్సిన్ ని అభివృద్ధి చేయడానికి ఇప్పటివరకూ ఉన్న విధానాలు అత్యంత ఖరీదైనవి…ఒకవేళ వ్యాక్సిన్ డెవలప్ చేయగలిగినా, సామాన్యులకు తక్కువ రేటుకి అందించడం జరిగే పని కాదు… అలానే ప్రభుత్వాలకు కూడా ఎక్కువ రేటు పెట్టి కొని బాధితులకు వ్యాక్సిన్ ఇవ్వడం అసాధ్యం…. పోలియో నివారణకు పిల్లలందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తుందంటే కారణం అది చాలా చవక కనుక.
FDA నిర్దేశించిన ఉత్తమ తయారీ నాణ్యత (GMP) స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూ వ్యాక్సిన్ తక్కువ ధరకు ఉత్పత్తి చేయగలిగినప్పుడు మాత్రమే HIV వ్యాక్సిన్ చౌకగా బాధితులకు అందించగలరు… అమెరికాకు చెందిన National Institutes of Health (NIH) సంస్థ ఈ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది… NIH వారి డిస్కవరీ జట్టులోని శాస్త్రవేత్తల ఆలోచనలు అన్నీ ఈ కల చుట్టూనే తిరుగుతున్నాయి… అంతా బావుంది కానీ వారి కలలకు, ఆలోచనలకు ఆలంబనగా తయారీ విధానం రూపొందించడం, అలా తయారీ అయిన వ్యాక్సిన్ మనుష్యుల మీద ప్రయోగించడం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నపని.
అమెరికాలో అత్యంత కీలకమయిన ఇంతటి బృహత్తరమైన పనిని తన భుజాలమీద వేసుకుని ముందుకు నడిపిస్తున్నాడు యువ శాస్త్రవేత్త భీమడోలు గ్రామానికి చెందిన డాక్టర్ Krishna Gulla. NIH లో వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమానికి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ మనోడే కావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం..తాజాగా తాను అతిచౌకగా, అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్ తయారీకి ఒక విధానం అభివృద్ది చేశారు.ఈ పరిశోధనా సారాంశాన్నిమొన్న (ఎయిడ్స్ వ్యాక్సిన్ అవగాహన రోజున) సైన్స్ డైరెక్ట్ వారు ముందస్తుగా ఆన్లైన్ లో ప్రచురించారు. 100 శాతం వాస్తవిక సమాచారాన్ని అందించే సైన్స్ డైరెక్టులో ప్రచురణ అవ్వడం అంటే ఆషామాషీ కాదు…ఈ విధానంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇప్పటికే మనుష్యుల మీద కూడా ప్రయోగాలు చేశారు. అతి త్వరలో వాటి వివరాలు కూడా ప్రచురించబోతున్నారు.
మేమిద్దరం ఈవిషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు “మరి పేటెంట్ కి అప్లై చేశారా తమ్ముడూ?” అని అడిగితే “లేదన్నా ఆ ఉద్దేశ్యం మాకు లేదు.. అలా చేస్తే ఈ ప్రయోగానికే అర్ధం లేదు.. ప్రపంచవ్యాప్తంగా HIV బాధితులందరికీ వ్యాక్సిన్ అందాలనేది మా ఆశయం…కాబట్టి మేము పేటెంట్ చేయబోము” అని తమ్ముడు కిట్టు చెప్పిన సమాధానం నన్ను ఎంతగానో కదిలించింది..ఎంతోమందికి మేలు చేసే ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసిన డాక్టర్ కృష్ణకు భీమడోలు … అలాగే తెలుగు ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు.