One of the scariest places…………
కుర్సియాంగ్ లోని ‘డౌ హిల్’….. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ హిల్ స్టేషన్..అందమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు, తేయాకు తోటలు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత.
అలాగే ఇది దేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా కూడా పేరుగాంచింది. దీని చుట్టూ భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ పర్యాటకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలోనే వెళుతుంటారు.
డౌ హిల్ అందాలు.. ఆకర్షణలు
@ ప్రకృతి సౌందర్యం: డౌ హిల్ చుట్టూ పచ్చని తేయాకు తోటలు, దట్టమైన అడవులు … పర్వత దృశ్యాలు ఉన్నాయి@ డౌహిల్ డీర్ పార్క్: ఇది పచ్చని అభయారణ్యం, ఇది ప్రకృతి ప్రేమికులకు అనువైన ప్రశాంతమైన ప్రదేశం.ఇక్కడ జింకలను చూడవచ్చు .. కుటుంబంతో టైం ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్రదేశం.
@ మంచుతో కప్పబడిన దృశ్యాలు: ఇక్కడ నుండి మంచుతో కప్పబడిన కాంచన్ జంగా శిఖరాలను చూడవచ్చు.@ జలపాతాలు: కొండ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ అందమైన జలపాతాలు కూడా ఉన్నాయి. @ డౌ హిల్ పర్యాటకులకు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశంతో పాటు, ఉత్సుకత కలిగించే భయానక కథలతో ఒక ప్రత్యేకమైన అనుభవాన్నిఅందిస్తుంది.
పారానార్మల్ కార్యకలాపాలు
ఇక్కడ పారానార్మల్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయని అంటారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడి అడవులు, పాఠశాల అతీంద్రియ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయని స్థానికుల నమ్మకం. అడవుల్లో కట్టెలు కొట్టేవారికి ఒక తలలేని బాలుడి మొండెం తరచుగా కనిపిస్తుందని .అది రోడ్డుపై నడుస్తూ అకస్మాత్తుగా అడవుల్లోకి వెళ్లి అదృశ్యమవుతుందని చెబుతుంటారు.
ఈ రోడ్డు పై నడుస్తుంటే వెనుక నుంచి ఎవరో అనుసరిస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. చాలామంది భయపడి వెనక్కి వస్తుంటారట. కొందరికి ఎర్రటి కన్ను తమ వైపు చూస్తుండటం కూడా గమనించినట్టు చెబుతారు. బూడిద రంగు దుస్తులు ధరించిన ఒక దెయ్యం కూడా తిరుగుతుంటుందని అంటారు.
డౌ హిల్ రోడ్ .. ఫారెస్ట్ ఆఫీస్ మధ్య ఉన్న ఒక చిన్న మార్గాన్ని”డెత్ రోడ్” అని పిలుస్తారు.ఆ మార్గంలో 
ఈ పరిసర ప్రాంతాల్లో నడుస్తుంటే గుసగుసలు,అరుపులు వంటి వింత శబ్దాలు వినిపిస్తాయనే కథలు ప్రచారంలో ఉన్నాయి.దట్టంగా అలుముకున్న అడవుల వాతావరణం కూడా భయంకరంగా ఉంటుంది. ఎత్తైన చెట్ల నడుమ పగలే చీకటిగా ఉంటుంది. రకరకాల శబ్దాలు వినిపిస్తుంటాయి.బలహీన మనస్కులైతే ఖచ్చితంగా భయపడతారు.
గతంలో ఇక్కడ కొన్ని అసహజ మరణాలు కూడా చోటుచేసుకున్నాయని అంటారు. చీకటి పడిన తర్వాత నిషేధిత ప్రాంతాలకు వెళ్లవద్దని స్థానికులు చెబుతుంటారు. డౌ హిల్ లో వసతి సౌకర్యాలున్నాయి. సమీపం లోని కుర్సియాంగ్ లో కూడా హోటళ్లు ఉన్నాయి
మార్చి నుంచి జూన్ వరకు ఇక్కడ వాతావరణం ఆహ్లదకరంగా ..అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో ‘డౌ హిల్’ అందాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటే మంచిది. డార్జిలింగ్ నుండి దాదాపు కుర్సియాంగ్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

