త్వరలో అందుబాటులోకి నాసల్ టీకా !

Sharing is Caring...

Nasal vaccine developed by Bharat Biotech………………………

కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో  నాసల్ టీకా అందుబాటు లోకి రాబోతోంది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా  ఇవ్వడానికి  కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు కూడా ఇచ్చింది.

ఈ నాసల్ వ్యాక్సిన్ ధరను  భారత్ బయోటెక్ ప్రకటించింది.  ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800 (పన్నులు అదనం)గా నిర్ణయించింది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 325కే ఇవ్వబోతోంది. 

ఈ నాసల్ టీకా జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది.  ‘ఇంకోవాక్’ (INCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్  తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ చెబుతోంది. బూస్టర్ డోస్ కోసం ఎదురు చూసే వారు త్వరపడవచ్చు. 

ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్ గా తీసుకోవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

బీబీవీ 154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ప్రపంచంలోనే  ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన తొలి నాసల్ వ్యాక్సిన్ గా ఇంకోవాక్ నిలవడం విశేషం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!