ఈ బ్యాంక్ షేర్లపై ఓ లుక్కేయండి !

Sharing is Caring...

ప్రభుత్వరంగానికి చెందిన కెనరా బ్యాంక్ పనితీరు ప్రోత్సాహకరం గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నిరర్ధక ఆస్తుల కోసం చేసిన కేటాయింపులు తగ్గడంతో నికర లాభం మూడింతలు పెరిగి రూ. 1177 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ. 406 కోట్లు మాత్రమే. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 20685. 91 కోట్లనుంచి రూ. 21210. 06 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ. 6096 కోట్లనుంచి రూ. 6147 కోట్లకు పెరిగింది.

ఇక మొండి బకాయిలు కూడా తగ్గుముఖం పట్టాయి.బ్యాంక్ రావాల్సిన బకాయిల వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 10000 కోట్లను రికవరీ చేయాలన్న లక్ష్యంతో బ్యాంక్ పనిచేస్తున్నది. మార్చి కంటే ముందే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని యాజమాన్యం భావిస్తున్నది. కాగా బ్యాంక్ డిపాజిట్లు కూడా 11. 6 శాతం వృద్ధితో 9. 70. 481 కోట్లకు చేరుకున్నాయి. గతం తో పోలిస్తే పనితీరు మెరుగుపడటంతో షేర్ల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.

బ్యాంక్ కి 115 సంవత్సరాల చరిత్ర ఉంది.  ఆరువేలకు  పైగా శాఖలున్నాయి. అనుబంధంగా మూడు గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. లండన్ ,చైనా, హాంకాంగ్ ల్లో కూడా బ్యాంక్ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం కెనరా బ్యాంక్ షేర్ ధర 146 వద్ద ట్రేడ్ అవుతోంది. 52 వారాల కనిష్ట ధర రూ. 82 కాగా గరిష్ట ధర  రూ.174 మాత్రమే.  ప్రస్తుత ధర వద్ద కానీ .. ధర తగ్గినపుడు కానీ షేర్లలో మదుపు చేయవచ్చు. ధీర్ఘకాలిక వ్యూహంతో షేర్లను కొనుగోలు చేయవచ్చు. గతంలో తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసిన వారు పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!