షేర్లలో మదుపు చేసి అంతో ఇంతో లాభాలు అర్జించాలంటే క్యాష్ ఫ్లో కంపెనీలను ఎంచుకోవడం మంచిది . అన్ని కంపెనీలలో ఫ్రీ క్యాష్ ఫ్లో వుండదు.అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పదం గురించి చాలామంది ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్, ప్లాంట్ కొనుగోలు వంటివి కాపిటల్ వ్యయానికి పోగా మిగిలిన నగదునే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు.ఇలాంటి నగదు నిల్వలు చాలా కంపెనీలలో వుంటాయి. కొన్ని కంపెనీలలోఅయితే భారీ గా వుంటాయి.భవిష్యత్ వివిధ అవసరాల కోసం ఈ నగదు నిల్వలను ఉపయోగిస్తుంటారు. కంపెనీ ఆర్ధిక పరిస్థితి లో తేడాలు వచ్చిన సందర్భం లో ఈ నగదు నిల్వలే కంపెనీ ని ఆదుకుంటాయి.అలాగే కంపెనీలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే భారీ గా నిధుల అవసరం వుంటుంది.
భవిష్యత్ అవసరాల కోసమే గాక డివిడెండ్ చెల్లింపులకు కూడా నిధుల అవసరం వుంటుంది. కేవలం క్యాష్ ఫ్లో చరిత్ర నే కాకుండా డివిడెండ్ ను కంపెనీ క్రమం తప్పక చెల్లిస్తున్నదా లేదా అనే అంశం కూడా పరిగణన లోకి తీసుకొని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి.మార్కెట్లో షేర్ ధర వృద్ధి తో సంబంధం లేకుండా కంపెనీ పని తీరు ఫలితాల పై ఆధారపడి రాబడులు అందుకోవచ్చు.చాల మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్నీ నిర్లక్ష్యం చేస్తుంటారు. షేర్ ధర పెరుగుదల పైనే దృష్టి పెట్టకుండా ముఖ్యం గా దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే ఇన్వెస్టర్లు క్యాష్ ఫ్లో కంపెనీ ల పై కన్నేయ వచ్చు.
ఇటు ఫ్రీ క్యాష్ ఫ్లో ను కలిగి మరో వైపు ఆకర్షణీయమైన డివిడెండ్ ను చెల్లించే కంపెనీలు ఎన్నో వున్నాయి. అలాంటి వాటిని ఇన్వెస్టర్లు ఎంచుకుంటే పెట్టుబడికి రిస్క్ వుండదు .మార్కెట్లో షేర్ ధరలు హెచ్చు తగ్గులకు గురైనప్పటికీ క్యాష్ రిచ్ కంపెనీల షేర్లను ఎంచుకుంటే డివిడెండ్ పరం గా ఆదాయం పొందవచ్చు. అలాగే మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే షేర్ ధరలు పెరిగిన సందర్భం లో పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు షేర్లను ఎంచుకొనే ముందు ఆయా కంపెనీల పూర్వాపరాలను పరిశీలించాలి.
కంపెనీలు క్యాష్ రిచ్ కంపెనీలో కాదో తెలుసుకోవాలి.ఈ విషయాలు తెలుసు కోవాలంటే , కొంత కసరత్తు చేయాలి. కంపెనీ చరిత్ర ను మొత్తం చదివితే వాస్తవాలు తెలుస్తాయి . ఆ తర్వాతే మంచి క్యాష్ రిచ్ కంపెనీ షేర్లను ఎంచు కొని మదుపు చేయాలి. ఫ్రీ క్యాష్ ఫ్లో కంపెనీలలో ఓ ఎన్ జీ సీ,కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ ,విప్రో,హిండాల్కో , సెయిల్ , ఎన్ ఏం డీసీ,టీ సీ ఎస్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఫెడరల్ బ్యాంక్, గుజరాత్ గ్యాస్, భారత్ డైనమిక్స్ వంటి కంపెనీలు వున్నాయి .
———– KN