అతి ఖరీదైన అండర్ గ్రౌండ్ వాటర్ రిసార్ట్ !

Sharing is Caring...

పై ఫోటో లో మీకు కనిపించేది నీటి అడుగున నిర్మించిన ఒక రిసార్ట్ లోని బెడ్ రూమ్. మాల్దీవుల్లో ఉన్న ఒక రిసార్ట్ లో భాగమది. ఆ రిసార్ట్ పేరు మురక.పేరు చిత్రంగా ఉంది కదా. దీని ప్రత్యేకత ఏమిటంటే … అండర్ గ్రౌండ్ వాటర్ రిసార్ట్ ఇది. ప్రపంచంలోనే  తొలి అండర్ గ్రౌండ్ రిసార్ట్ గా పేరుపొందింది.

కాన్రాడ్‌ కంపెనీ మాల్దీవుల్లోని ‌ రంగాలి ఐలండ్‌లో రెండు అంతస్తుల్లో ఈ రిసార్ట్ ను నిర్మించింది.రిసార్ట్ లో కింది అంతస్తు సముద్రం లోపల 16అడుగుల లోతున ఉంటుంది.(పై ఫోటో అదే ) మొత్తం అద్దాలతో నిర్మించిన ఈ కింది అంతస్తులోకి వెళ్తే నీటి మధ్యలో ఉన్నట్లే ఉంటుంది. చుట్టూ ఉన్నఅద్దాల్లో నుంచి రకరకాల సముద్ర జీవులూ మన చుట్టూ సంచరిస్తూ కనిపిస్తుంటాయి.

ఈ రిసార్ట్ 2018 లో ప్రారంభమైంది. అతి ఖరీదైన రిసార్ట్ ఇది . సామాన్యులు ఆవైపు కూడా తొంగి చూడలేరు. ఇలా మీడియాలో చూసి అబ్బురపడాల్సిందే.ఈ రిసార్ట్ ను వేరే దేశంలో నిర్మించి అక్కడనుంచి మాల్దీవులకు తరలించారు. సముద్ర తీరానికి కొద్దీ దూరంలో దీన్నినీటిలో ఫిక్స్ చేశారు. అక్కడ  పై అంతస్తు ని నిర్మించారు.

దీని బరువు 6 వందల టన్నులట. 110 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. ఇక్కడ స్టే చేయాలంటే ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి.పర్యాటకుల్ని బోట్ లో రిసార్ట్ వద్దకు చేరుస్తారు. స్టీలు, కాంక్రీట్‌, యాక్రిలిక్‌లతో నిర్మించిన ఈ రిసార్ట్ లో  నీటి అడుగున ఉండే కింది అంతస్తులో ఒక్కటే మాస్టర్‌ బెడ్‌రూమ్‌ ఉంటుంది. ఈ గదిలో  గోడలు పారదర్శకంగా ఉండి సముద్రపు అందాలన్నీ మనకు కనిపిస్తుంటాయి.

నీటి మీద తేలినట్లుండే పై అంతస్తులో మరో రెండు బెడ్‌రూమ్‌లూ, లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ ఏరియా ఉంటాయి.  సముద్రపు నీటిని చూస్తూ జలకాలాడేలా బాత్ రూమ్, స్విమ్మింగ్‌పూల్‌, స్పా, జిమ్‌, బార్‌ వంటి సదుపాయాలూ ఉంటాయి.  చుట్టూ నీరు..  పైన చుక్కలు కనిపించే ఆకాశం … చల్లగా వీచే సముద్రపు గాలులు .. రిసార్ట్ ముందు కూర్చుని  ప్రకృతిని ఆస్వాదిస్తుంటే ఆ అనుభూతులు అద్భుతం.

వండి పెట్టేందుకు కుక్ ..  ఒక సర్వెంట్, ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌  అందుబాటులో ఉంటారు. ఈ అనుభూతులు  సొంతం చేసుకోవాలంటే  ఒక రాత్రికి 50 వేల డాలర్లు ఖర్చు అవుతుంది. నాలుగురాత్రులకైతే 2 లక్షల డాలర్లు పే చేయాలి. వెకేషన్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. సంపన్నులకు ఇది పెద్ద ఖర్చేమీ కాదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!