పిచ్చుకలను ప్రేమిద్దాం ! (2)

Sharing is Caring...
Save Sparrows......................... 

పిచ్చుకల జీవన కాలం మూడేళ్ళు.-కథల్లో, పాటల్లో,సామెతల్లో పిచ్చుకకు ప్రాధాన్యం. -మానవులు-పిచ్చుకల మధ్య విడదీయరాని బంధం.బతుకు మీద ఆశకు ప్రతి రూపాలు పిచ్చుకలు. -మగ పిచ్చుక బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా ఉంటుంది. -గడ్డి పరకలు,పుల్లలతో అందమైన గూళ్ళు నిర్మించే మోడ్రన్ ఆర్కిటెక్. త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు.

# పిచ్చుకల సంరక్షణకై మనం చేయవలసిన కొన్ని అవగాహనా కార్యక్రమాలు #

* ఫ్లకార్డ్ చాలెంజ్ ( పిచ్చుక చిత్రం గల కార్డు ప్రదర్శించడం

* పిచ్చుక గురించి సమాచారం తెలియజేస్తూ కరపత్రాలు ముద్రించడం * వైవిధ్యమైన పిచ్చుక చిత్రాలు ప్రచారం చేయటం. * పిచ్చుకల గురించి లఘు చిత్రాలు ప్రదర్శించడం.*పిచ్చుకల సంరక్షణకై చిత్రలేఖనం పోటీలు నిర్వహించటం.

*పిచ్చుకల గురించి కవితలు రాయించడం.* పిచ్చుకల జీవితంలో ని ముఖ్యమైన ఘట్టాలను, సందర్భాలను, సంఘటనలను జీవన చిత్రణ చెయ్యటం.* ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పిచ్చుకను అందరికీ పరిచయం చేసి వాటి జీవన విధానం పట్ల అప్రమత్తం చేయడం.
* పిచ్చుకల ను కాపాడడం ఎలా అన్న అంశంపై వర్క్ షాపులు నిర్వహించడం. * పిచ్చుకపై చిత్ర ప్రదర్శన చేయడం.

# పిచ్చుకల కోసం మనం ఏం చేయవచ్చు #
* పిచ్చుకల కోసం కృత్రిమ నివాసాలు ఏర్పాటు చేయడం. * మన ఇంటి పైన, ఇంటి ముందర గోడలపైన చిన్నచిన్న గిన్నెలలో నీళ్ళు నింపడం. * బియ్యం, జొన్నలు, సజ్జలు వివిధ వివిధ రకాల ధాన్యపు గింజలు వాటికి అందుబాటులో ఉంచడం. * గాలిపటాలు ఎగురవేసేటప్పుడు దారాలు వాటికి తగలకుండా జాగ్రత్త పడటం. * నేటి విద్యార్థులకు/యువతకు అవగాహన కల్పించడం.

————
ప్రియమైన ఓ పిచ్చుక….
నీ చక్కని రూపం
మా ఇంటావరణలో కనపడితే
నా గుండె కువకువలాడుతుంది.

నీవు కిచకిచల
పల్లవి పల్లకిలో ఊరేగితే
నా హృదయపు కుసుమాలు విచ్చుకుంటాయి.

నీవు స్వేఛ్చగా…
మా ఇంటి చూరుల్లో వెచ్చగా
నలువైపులా అమాయకంగా చూస్తుంటే…
నా నేత్రాలు హరిత పత్రాలవుతాయి.

నీవు ఆ మూల నుండి ఈ మూలకు
ఈ మూల నుండి ఆ మూలకు
చక్కర్లు గొడుతుంటే
నాలో ఏ మూలో దాగిన ఆనందసాగరాలెగసిపడతాయి.

నేనేవూరెళ్ళనా
నీవెదురైతే
నా విహార యాత్రలు
హాయిగా సాగుతాయి..

నీ వయ్యారి నడకలకు
విరిదండాలు వెయ్యాలని
నా ప్రతిన.!

నీ సింగారి ముంగురులకు
బంగారు రంగులద్దాలని
నా తపన..!!

మా ఇంటి చూరులో వేలాడుతూ ఊయలూగే నిన్ను,
అలా అలా అలలా అలివేణివై ఎగిరే నీకు,

సెల్ ఫోన్ టవర్ల వలలు విసిరి భక్షిస్తున్నదెవరు నేస్తమా..!?

వ్యవసాయ రంగానికి చేదోడైన
స్నేహానికి చిరకాల చిహ్నమైన
నిన్నెలా రక్షించుకోగలం నేస్తమా…

మా గుండెలు జొన్న కంకులు గా మారితే తప్ప…!!!???

… “స్ఫూర్తి” శ్రీనివాస్.  పిచ్చుకలను ప్రేమిద్దాం
9985857599.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!