త్వరలో లాలూ బయోపిక్!!

Sharing is Caring...

Lalu’s life on screen……….

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత ఘటనల ఆధారంగా బయోపిక్  రెడీ అవుతోంది.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

లాలూ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారట డైరెక్టర్‌. ఇక బయోపిక్‌లో ప్రముఖ నటుడు ఓ మై గాడ్‌ 2 ఫేమ్ పంకజ్‌ త్రిపాఠీ లాలూ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్‌ కుమార్‌ రావ్‌, విక్కీ కౌశల్‌, మనోజ్‌ బాజ్‌పేయిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

లాలూ తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను ప్రధానంగా ఈ బయోపిక్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది.పూర్తి స్క్రిప్ట్ తయారు చేసి  కుటుంబ సభ్యులకు వినిపించి  అనుమతి తీసుకుంటారని తెలుస్తోంది. ఒకసారి స్క్రిప్ట్ ఆమోదం పొందిన వెంటనే షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్రకాష్‌ ఝా రెడీగా ఉన్నారట. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ బయోపిక్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, ప్రముఖ బాలీవుడ్ స్టార్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు డైరెక్టర్‌.
భారత రాజకీయ చరిత్రలో లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రత్యేక స్థానం ఉంది. 1973లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన లాలూ 29 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణల్లో దోషిగా కూడా తేలారు. ముఖ్యంగా పశుగ్రాసం, రైల్వే రిక్రూట్‌మెంట్ టెండర్లు ఇతర కుంభకోణాల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై ఆరోపణలు ఉన్నాయి. మరి బయోపిక్‌ లో ఈ స్కామ్‌లను చూపిస్తారా? లేదా?అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!