ఏడువేల అడుగుల లోతులో ఉన్న క్రుబేరా గుహలు !

Sharing is Caring...

బొర్రాగుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు మనకు తెల్సిన పెద్ద గుహలు. అయితే వాటికంటే అద్భుతమైన గుహలు జార్జియా దేశంలో బయటపడ్డాయి.  ప్రపంచంలోనే అతి లోతైనవిగా ఈ క్రుబేరా గుహలు పేరుపొందాయి. ప్రధాన గుహను వోరోనియా కేవ్ అని కూడా పిలుస్తారు, అంటే రష్యన్ భాషలో ‘కాకుల గుహ’ అని అర్ధం. గుహల ప్రవేశద్వారం వద్ద అనేక కాకులు గూడు కట్టుకోవడంతో ఈ పేరు వచ్చింది.

ఈ గుహల  లోతు  2,197 మీటర్లు.  అంటే సుమారు 7,208 అడుగులు.  ఆమేరకు కిందికి దిగితే భూగర్భంలో కనిపిస్తాయి ఈ గుహలు. భూమి పొరల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. జార్జియా దేశంలోని అబ్ఖజియా ప్రదేశంలో ఉన్న ఈ గుహలు 1960లో వెలుగు చూశాయి.  

జార్జియా సరిహద్దులో ఉన్న అబ్ఖాజియాలోని అరబికా మాసిఫ్ నల్ల సముద్రం అంచున ఉంది. ఈ గుహలను కనుగొన్నప్పటి నుంచి అన్వేషకులు, శాస్త్రవేత్తలు గుహల్లోకి  దిగడానికి ప్రయత్నించారు. ఈ విధంగా ప్రతిసారీ కొత్త రికార్డులను నెలకొలిపారు. 2001 లో క్రుబెరా గుహలను లోతైన గుహలు గా అధికారికంగా ప్రకటించారు. ప్రఖ్యాత రష్యన్ భూగోళ శాస్త్రవేత్త అలెగ్జాండర్ క్రుబెర్ స్మారకార్థం ఈ గుహలకు క్రుబెర్ అని నామకరణం చేశారు.

అబ్ఖజియా ప్రాంతం రష్యా నుంచి వెళితే దగ్గరగా ఉంటుంది.  మాస్కో నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో ఇక్కడ చల్లగానూ, వాతావరణం అనువుగానూ ఉంటుంది. బయట నుంచి గుహలు చూడవచ్చు.టెర్మినల్ సంప్‌లోకి లోతుగా వెళ్లి ఉక్రేనియన్ డైవర్ జెన్నాడి సమోఖిన్ 2012 లో రికార్డు నెలకొల్పారు.

భూగర్భంలో ఉన్న ఈ గుహలు  గడ్డ కట్టిన నీటితో ఉన్నాయి. లోపల సొరంగాలు చాలా ఇరుకైనవి గా ఉన్నాయి.  ఫొటోలో ఆ సొరంగాలను  చూస్తే నే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. లోపలకు దిగడం  సాహసోపేతమనే చెప్పుకోవాలి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిశోధకులకు మాత్రమే ప్రవేశం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!