కృష్ణ వంశీ మార్క్ ‘ఫామిలీ ఎంటర్టైనర్’ !!

Sharing is Caring...

Block buster Movie ……………………………..

సూపర్‌ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్‌బాబు కి ఇది నాలుగో సినిమా. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కృష్ణ వంశీ తనదైన శైలిలో తీసిన ప్రేమకథా చిత్రం. మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి….  స్టార్ గా మార్చిన సినిమా ‘మురారి’. మంచి పాటలతో టాలీవుడ్ క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకుంది.

మొన్నటి ఫిబ్రవరి 17 కి ఈ సినిమా విడుదలై 24 ఏళ్ళు అవుతుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కృష్ణ వంశీ దగ్గరున్న మ్యాజిక్ అదే మరి. సినిమా చూస్తున్నంత సేపు కథలోని పాత్రలను ఫ్యామిలీ సభ్యులుగా ఫీలవుతుంటాం. 

ఓ ప్రేమకథను కుటుంబ బంధాల నేపథ్యంలో అల్లి  ..దానికో సెంటిమెంట్,ఫాంటసీ పాయింట్ ను జోడించి అందమైన గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా కృష్ణ వంశీ అద్భుతంగా తెరకెక్కించారు.ఈ  సినిమా ఒక్క మహేష్ కే  కాదు దర్శకుడు కృష్ణ వంశీకి మరపురాని హిట్  చిత్రం.

సునిశితమైన హాస్యం, కుటుంబ సభ్యుల ఆప్యాయత,అనురాగాలను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసుకుంది. అలాగే ఒక  దేవత కోపానికి గురైన వంశానికి చెందిన హీరో చివరికి ఎలా మృత్యువునుంచి బయటపడతాడో ఉత్కంఠ భరితంగా చూపడంతో ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా కథను మలచుకుని కృష్ణ వంశీ  మహేష్ బాబు ను సూపర్ స్టార్ చేశారు.

మురారీ సినిమా మ్యూజికల్ గా కూడా హిట్ అయింది. “అలనాటి రామచంద్రుడు” పాట పెళ్లి పందిళ్లలో వినబడుతూనే ఉంటుంది. క్లైమాక్స్ కు ముందు ఈ పాట వద్దని చాలామంది ప్రముఖులు చెప్పినప్పటికీ కృష్ణ వంశీ వినలేదు. చివరికి ఈ అంశం హీరో కృష్ణ వద్దకు వెళ్ళింది. ఆయన కూడా క్లైమాక్స్ లో మాస్ సాంగ్ అయితే బాగుంటుంది  అన్నారట.

కృష్ణ వంశీ ససేమిరా అనడం తో కృష్ణ ఒకే అన్నారట. చివరికి కృష్ణ వంశీ నమ్మకమే గెలిచింది.  పాటకు చక్కని ఆదరణ లభించింది. ఈ సినిమా కోసం మణిశర్మ మంచి ట్యూన్స్ ఇచ్చారు. “చెప్పమ్మా ..చెప్పమ్మా” …. “ఎక్కడ ఎక్కడ ” “డుం డుం ” వంటి పాటలు కూడా విన సొంపుగా ఉంటాయి.వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజల పాటలు సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి. 

హీరో మహేష్ బాబు మురారి పాత్ర కు చక్కగా సూట్ అయ్యాడు. పాత్రలో ఒదిగిపోయాడు కూడా. అన్ని రకాల ఎమోషన్లను మహేష్ అద్భుతంగా వ్యక్తీకరించాడు. ఈ కథ మహేష్ ని కలసిన తర్వాత కృష్ణవంశీ తయారుచేసుకున్నారు. సోనాలి బింద్రే కూడా పాత్రకు బాగా సూట్ అయింది. టీజింగ్ సీన్లు సూపర్ గా పండాయి. నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది.

నటి లక్ష్మి ఎక్కువ మార్కులు కొట్టేసింది.ఆమె సినిమాకు ఎస్సెట్.  మహేష్ సినిమాల్లో నాకు నచ్చిన మరో సినిమా ఇదే అంటూ ఆమధ్య  సోనాలి బింద్రే సోషల్ మీడియాలో స్పందించారు. ఇక ఈ సినిమాలో మురారీ పాత్ర మహేష్ కు బాగా నచ్చిన పాత్ర … అంతేకాదు బాగా ఇష్టమైన పాత్ర అని ఆయనే స్వయంగా ఒక సందర్భంగా చెప్పారు.

హైదరాబాద్ లో ఈ సినిమాను తండ్రి తో కలసి మహేష్ చూసారు. సినిమా ముగింపులో కృష్ణ  బాగా ఎమోషనల్ గా ఫీలై తన భుజాలను పట్టుకున్నారని మహేష్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.ఈ సినిమాను కన్నడలో గోపి (2006)గా పునర్నిర్మించారు.

తమిళంలో కూడా డబ్ చేశారు. ఈ కథ ప్రేరణతోనే విజయ్ నటించిన తమిళ చిత్రం పుదియ గీతై (2003) రూపొందింది. 2015లో హిందీలో ‘రౌడీ చీతా’గా డబ్ చేశారు.. మురారి ని 2024లో రీరిలీజ్ చేశారు. మంచి వసూళ్లను సాధించింది.. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది చూడని వారు చూడవచ్చు .

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!