కైలాస మానస సరోవర యాత్ర జూన్ నుంచే ..

Sharing is Caring...

KAILASA MANASA SAROVAR TRIP…………………………

ఈ ఏడాది (2023 ) లో కైలాస మానస సరోవర యాత్రకు తేదీలు, టిక్కెట్ ధరను ప్రకటించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది టికెట్ ధర 2 లక్షల 50 వేల రూపాయిలుగా నిర్ణయించారు. కోవిడ్ -19 తర్వాత మొదటిసారిగా 2023లో కైలాస మానస సరోవర యాత్రను ప్రారంభించనుంది. మూడేళ్ల తరువాత చైనా ప్రభుత్వం కైలాస మానస సరోవర్ యాత్రికుల కోసం నేపాల్-చైనా సరిహద్దులో అనేక పాయింట్లను తెరిచింది.

కైలాస మానస సరోవర్ యాత్ర వివిధ మతాల భక్తులు ప్రాముఖ్యతనిచ్చే తీర్థయాత్ర. కైలాస పర్వతం మహా శివుని నివాసంగా భావిస్తుంటారు. అలాగే బౌద్ధమతం, జైనమతం,బోన్ మతస్తులు ఈ పర్వతాన్ని ఆధ్యాత్మిక ప్రదేశంగా కొలుస్తారు. కైలాస పర్వతం టిబెట్లోని ట్రాన్స్- హిమాలయాలోని కైలాష్ శ్రేణిలో ఉంది. ఈ ప్రయాణం సాధారణంగా నేపాల్లోని ఖాట్మండులో ప్రారంభమవుతుంది. అక్కడి నుండి యాత్రికులు సరిహద్దు పట్టణమైన జాంగ్ము గుండా టిబెటన్ పీఠభూమికి ప్రయాణిస్తారు.. కైలాస మానస సరోవర పర్యాటకులకు ఇండియా, చైనా ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తాయి.

కైలాష్ మానస సరోవర్ యాత్ర 2023 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చైనా కఠినమైన నిబంధనలతో యాత్రకు వీసాలు జారీ చేస్తున్నది. టిబెట్ టూరిజం బ్యూరో ప్రకారం గతంలో ఒక వ్యక్తికి టికెట్ ధర లక్షా 50 వేల రూపాయిలుండగా ఈ ఏడాది 2 లక్షల 50 వేలకు పెంచారు. ఇప్పటి వరకు వీసాను ఆన్ లైన్ లో తీసుకొనే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది వీసా తీసుకోవడానికి యాత్రికులు భౌతికంగా హాజరుకావాలని నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు అంగీకరించేది లేదని అధికారులు చెబుతున్నారు. వీసాలు పొందే భారతీయ యాత్రికులు కనీసం ఐదుగురు ఉండాలంటూ… వారిలో కనీసం నలుగురు భౌతికంగా హాజరు కావాలని చైనా అధికారులు అంటున్నారు.

కైలాస మానస సరోవర్ యాత్ర ఎలా ఉంటుందో ఈ కింది వీడియో చూడండి

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!